దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే నేడు రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని మూవీ టీమ్ అందరూ కలిసి సెట్స్ లో ఎంతో ఘనంగా ఈ వేడుకను జరుపుకున్న ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది సినిమా బృందం.
‘నేడు మా ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ అంతా కలిసి ప్రజాస్వామ్య బద్దంగా రిపబ్లిక్ డే ని జరుపుకున్నాం’ అంటూ వారు ఫోటోలు పోస్ట్ చేయడం జరిగింది. కాగా దర్శకుడు రాజమౌళి సహా మూవీ యూనిట్ సభ్యులు అందరూ కూడా పాల్గొన్న ఈ వేడుక తాలూకు ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి.