సెన్సార్ బోర్డు నుండి U/A సర్టిఫికెట్ పొందిన రవితేజ ‘డిస్కో రాజా’…..!!

0
588

మాస్ మహారాజ రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘డిస్కో రాజా’ పై మాస్ రాజా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి, ఇవాళ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. రవితేజ ఒక డిఫరెంట్ రోల్ లో సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన నభ నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన లభించడంతో పాటు, సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలని అవి మరింతగా పెంచడం జరిగింది.

ఇకపోతే ఈనెల 24వ తదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు నేడు సెన్సార్ కార్యక్రమాలు నిర్వహించగా, సెన్సార్ బోర్డు నుండి ‘డిస్కో రాజా’ సినిమా కు U/A సర్టిఫికెట్ లభించింది. దర్శకుడు విఐ ఆనంద్ మార్క్ టేకింగ్ తో పాటు రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాదిస్తుందని సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here