ఆకట్టుకుంటోన్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ‘మై లవ్’ సాంగ్…..!!

0
752

యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముదుకు వచ్చి మంచి రెస్పాన్స్ సంపాదించింది. విజయ్ సరసన క్యాథరీన్ థెరిస్సా, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజా బెల్లె హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను కేఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఏ వల్లభ నిర్మిస్తుండగా జయకృష్ణ గుమ్మడి ఫోటోగ్రఫిని, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ ని అందిస్తున్నారు. ఇకపోతే నేడు ఈ సినిమా నుండి మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ స్వరపరిచిన ‘మై లవ్’ అనే రొమాంటిక్ మెలోడియస్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు.

శ్రీ కృష్ణ, రమ్య బెహరా ఎంతో హృద్యంగా ఆలపించిన ‘మై లవ్’ సాంగ్ ను రహమాన్ రచించారు. ఇక ప్రేయసి ప్రియుల మధ్య ప్రేమను వ్యక్తపరుస్తూ సాగె ఈ సాంగ్ ని వింటుంటే, యూత్ ని ఇన్స్టంట్ గా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు, అలానే సింగర్స్ రమ్య, శ్రీకృష్ణ ఇద్దరూ కూడా సాంగ్ ఎంతో ఫీలవుతూ పాడిన విధానం ఎంతో బాగుంది అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సాంగ్ కు యూట్యూబ్ లో మంచి వ్యూస్ లభిస్తున్నాయి. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here