రవితేజ ‘డిస్కోరాజా’ లో సాంగ్ పాడుతున్న బప్పీలహరి……!!

0
393

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డిస్కో రాజా’. పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, అలానే రెండు సాంగ్స్ కు శ్రోతల నుండి విశేషమైన స్పందన లభించింది. ఇకపోతే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మాస్ మహారాజ ఒక సాంగ్ ని పాడుతున్నట్లు సంగీత దర్శకుడు థమన్ నిన్న ఒక పోస్ట్ ద్వారా తెల్పడం జరిగింది. అయితే రవితేజతో కలిసి ఆ ఎనర్జిటిక్ సాంగ్ ను సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కం సింగర్ బప్పీలహరి పాడుతున్నట్లు థమన్  తెల్పడం జరిగింది.

అయితే ‘రం పం బం’ అనే పల్లవితో సాగె ఆ ఎనర్జిటిక్ సాంగ్ ను రవితేజతో కలిసి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కం సింగర్ బప్పీలహరి పాడుతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు సాయంత్రం 6 గంటలకు ఆ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు. తన గత సినిమాల మాదిరిగా దర్శకుడు విఐ ఆనంద్ ఈ సినిమాను కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here