‘వి’ షూటింగ్ ముగిసింది, ఉగాదికి కలుద్దాం : నాచురల్ స్టార్ నాని….!!

0
380

నాచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబు ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘వి’. గతంలో అష్టాచమ్మా, సమ్మోహనం, జెంటిల్ మ్యాన్ వంటి సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా నివేత థామస్, అదితి రావు హైదరి నటిస్తుండగా, అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు. నాని ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తి అయిందని నాని కాసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పిక్చర్ పోస్ట్ చేస్తూ తెలిపారు. వి మూవీ షూటింగ్ కి లాస్ట్ రోజు నేడు, సరిగ్గా సంక్రాంతి రోజు ముగిస్తున్నాం, ఉగాది రోజున సినిమాతో కలుద్దాం అంటూ ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఒక థ్రిల్లింగ్ సబ్జెక్ట్ తో పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు ఇంద్రగంటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఉగాది రోజైన మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here