ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగను పలువురు టాలీవుడ్ నటులు ఎంతో వైభవంగా జరుపుకుంటూ వాటి తాలూకు ఫోటోలు, పోస్టులను తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇకపోతే నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఆసక్తికరమైన ఫోటోని పోస్ట్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి సహా మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు మొత్తం కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న ఫోటోని షేర్ చేసిన చరణ్,
హ్యాపీ సంక్రాంతి అంటూ దానిని పోస్ట్ చేసారు.మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్, అల్లు శిరీష్ తదితరులను ఆ ఫొటోలో చూడవచ్చు. మెగాస్టార్ చిరంజీవి సహా మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు ఆనందంగా జరుపుకుంటున్న ఫోటో. చరణ్ పోస్ట్ చేసిన ఈ ఫోటో పై మెగా ఫ్యాన్స్ ఎంతో ఆనందంతో సంబరంగా కామెంట్స్ చేస్తున్నారు…..!!