‘జీ తెలుగు’ కుటుంబంలోకి ‘సూపర్ స్టార్ మహేష్’…!!

0
469

ఈ సంక్రాంతికి తన లేటెస్ట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం జీ తెలుగు టెలివిజన్ ఛానల్ తో చేతులు కలిపారు. ఇటీవల ఆయన పై చిత్రీకరించబడిన ప్రోమో వీడియో నేడు రిలీజ్ చేసింది జీ తెలుగు యూనిట్. ఆ ఛానల్ లో ప్రసారం అవుతున్న పలు సీరియల్స్ లోని కొందరు నటులను మహేష్ బాబు వరుసగా కలుస్తూ, ఒకింత డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్లాన్ చేసిన ఈ వీడియో ప్రోమో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.

మీ ప్రేమ, ఆధారాభిమానాలతో నన్ను సూపర్ స్టార్ ని చేసారు, సినిమా నన్ను నటుడిగా పరిచయం చేస్తే, టివి నన్ను మీ ఫ్యామిలీ మెంబెర్ ని చేసింది, జీ తెలుగు మీకు నాకు మధ్య వారధి అంటూ ప్రోమోలో మహేష్ బాబు పలికే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పండుగ సందర్భంగా ఇప్పటికే సరిలేరు మూవీ సక్సెస్ తో ఆనందంగా ఉన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్, జీ తెలుగు ద్వారా సూపర్ స్టార్ తమకు మరింత చేరువ అవుతుండడంతో ఫ్యాన్స్ మరింత సంబరంతో ఉప్పొంగిపోతున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here