జీ సినీ అవార్డ్స్ – 2020′ లో రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ కు నాలుగు అవార్డులు…!!

0
407

ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా జీ సినీ అవార్డ్స్-2020 వేడుక ఎంతో వైభవంగా జరిగింది. నిన్న రాత్రి హైదరాబాద్ లో కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ కి చెందిన పలువురు తారలు ప్రత్యేకంగా సందడి చేసి మరింత వన్నె తెచ్చారు. ఇక గత ఏడాది విడుదలైన సినిమాల్లో భాగంగా ఉత్తమ నటుడిగా సైరా మూవీకి గాను మెగాస్టార్ చిరంజీవి అందుకోగా, ఉత్తమ నటిగా ఓ బేబీ, మజిలీ సినిమాల్లో మంచి నటనను కనబరిచిన సమంత అక్కినేని అందుకున్నారు. లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డును కళాతపస్వి కె విశ్వనాధ్ గారు అందుకోగా, ఇస్మార్ట్ శంకర్ మూవీ ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.

బెస్ట్ డెబ్యూ మేల్, ఫిమేల్ క్యారగిరీల్లో దొరసాని మూవీ జంట ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ అందుకున్నారు. ఇక గత ఏడాది సూపర్ హిట్ కొట్టిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ ప్రొడ్యూసర్ గా ఛార్మి కౌర్, సెన్సేషనల్ హీరోగా రామ్ పోతినేని, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ, సెన్సేషనల్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ ఈ సినిమాకు సంబంధించి నాలుగు అవార్డులు అందుకోవడం జరిగింది. తమ సినిమాకు నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కినందకు ఇస్మార్ట్ హీరో రామ్, ప్రొడ్యూసర్ ఛార్మి, దర్శకుడు పూరి తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here