13 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వస్తోన్న లేడీ అమితాబ్‌ విజయశాంతి!!

0
377
Lady Amitabh Vijayashanthi

‘నేటి భారతం’, ‘ప్రతిఘటన’, ‘కర్తవ్యం’, ‘ఒసేయ్‌ రాములమ్మ’ వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన జాతీయ ఉత్తమ నటి, లేడీ అమితాబ్‌ విజయశాంతి. సూపర్‌స్టార్‌ మహేశ్‌ ‘సరిలేరు నీకెవ్వరు‘ చిత్రంలో భారతి పాత్రతో అద్భుతమైన రీఎంట్రీ ఇస్తున్నారు. మహేశ్‌, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి హైలైట్‌గా నిలవనున్నాయి. విజయశాంతి తప్ప ఎవ్వరూ ఆ పాత్రలో అంత గొప్పగా నటించలేరు అనేవిధంగా విజయశాంతి భారతి పాత్రని పోషించారు అని చిత్ర యూనిట్‌ అంటోంది. సూపర్‌స్టార్‌ మహేశ్‌ ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడే ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో నటించారు. మళ్ళీ ఇన్నేళ్లకు సూపర్‌స్టార్‌ మహేశ్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో విజయశాంతి రీఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే కొన్ని భారీ నిర్మాణ సంస్థలు లేడీ అమితాబ్‌ విజయశాంతితో నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జనవరి 11న విడుదలవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here