చైతన్యతో కలిసి ‘వెంకీమామ’ చేయడం ఆనందంగా ఉంది – విక్టరీ వెంకటేష్

0
1143

విక్ట‌రీ వెంక‌టేష్, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య కలిసి నటిస్తున్న భారీ ముల్టీస్టారర్ ‘వెంకీమామ‌’. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్స్‌పై కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో డి. సురేష్‌బాబు, టీజీ విశ్వ ప్ర‌సాద్ ఈ చిత్రాన్నినిర్మించారు. విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా విక్ట‌రీ వెంక‌టేష్ ఇంటర్వ్యూ ..

ప్ర‌మోష‌న్స్‌లో ఎక్క‌డ చూసిన మీ ఎన‌ర్జీనే క‌నిపిస్తోంది! ఆ ఎనర్జీ సీక్రెట్ ఏంటి?
-అంత ఎనర్జీ కి కారణం మీరే..మిమ్మల్ని చూడగానే ఆటోమాటిక్ గా ఎనర్జీ వస్తోంది. దానికి తోడు నాగచైతన్య తో కలిసి చేసిన సినిమా కావడం కూడా ఒక కారణం. ఈప్రాజెక్ట్ చాలా ప్రేమ, అభిమానులతో ఈ సినిమా చేశాం. షూటింగ్ చాలా సరదాగా జరిగింది. అలాగే రానాతో, చైతుతో ఒక సినిమా ఇద్దరితో కలిసి ఒక సినిమా చేయాలనేది మా నాన్న గారి కోరిక కూడా. అప్పుడు కుదరలేదు. ఇన్నిరోజులకి ఈ కథ దొరకడం, అన్ని కుదరడం చాలా హ్యాపీ. స్టోరీ కంటెంట్ కానీ, ఎమోషన్స్ కానీ చాలా చక్కగా వచ్చాయి.  ఇలాంటి మామ అల్లుళ్ళ కథలు ఇంతవరకూ రాలేదు.

నిజ జీవితంలో మామా అల్లుళ్ళు కావడం ఈ సినిమాకి ప్లస్ అయింది అనుకోవచ్చా?
– తప్పకుండా! మేము రియల్ మామ అల్లుళ్ళు కావడం ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. ప్రస్తుతం నా అభిమానులు కానీ, ప్రేక్షకులు కానీ కొత్త కథలు రావాలని కోరుకుంటున్నారు. అందుకే సీతమ్మవాకిట్లో సినిమాని వారు ఓన్ చేసుకొని సక్సెస్ చేశారు. ఈ సినిమాలో కేవలం ఫ్యామిలీ లేయర్ మాత్రమే కాకుండా ఎమోషన్, యాక్షన్ కోణంలో కూడా సినిమా చాలా బాగుంది.

గోదావ‌రిలో ఈత నేర్పా, బ‌రిలో ఆట నేర్పా… అని సినిమాలో డైలాగ్ చెప్పారు. మ‌రి నిజ జీవితంలో చైతు కి మీకు ఉన్న అనుబంధం గురించి?
– చైతు ఎప్పుడైనా నా ఫేవరెట్ కిడ్. చిన్నపుడు వాడిని హగ్ చేసుకోవడానికే ఫైట్ చేసేవాళ్ళం. అంత సాలిడ్ గా, క్యూట్ గా ఉండేవాడు. ఇంతతొందరగా యాక్టింగ్ నేర్చుకోవడం, నాతో కలిసి నటించడం థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది. ఎందుకంటే నాలాగే తనకి, రానాకీ కూడా యాక్టింగ్ లోకి రావాలని కోరిక లేదు. కానీ వచ్చేశాం. ప్రేక్షకులు మమ్మల్ని యాక్సప్ట్ చేశారు. మంచి సినిమా ఇచ్చిన ప్రతి సారి ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. చైతు కూడా చాలా నేర్చుకొని ఇండస్ట్రీ కి వచ్చాడు

ఈ సినిమా ద్వారా జాతకాల గురించి ఏం చెప్తున్నారు?
– వెంకీ మామ అన్ని ఎమోషన్ ఉన్న కమర్షియల్ మూవీ. ఏ కథలో అయిన ఎమోషన్స్ ని కరెక్ట్ గా మెర్జ్ చేయగలిగి, స్క్రీన్ ప్లే ఫ్లో బాగుంటే ఆ సినిమాకి తప్పకుండా మంచి ఆదరణ ఉంటుంది. ఈ సినిమా విషయంలో బిగినింగ్ లోనే ఆడియన్స్ రెండు క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయిపోతారు. ఒక స్ట్రాంగ్ రిలేషన్ షిప్ ఉంటే.. నిజమైన ప్రేమ ఉంటే.. ఈ జాతకాలు… నమ్మకాలు ఏవీ వాటి ముందు నిలబడవు అనేది ఈ సినిమాలో చెప్పాం. నేను కూడా అదే నమ్ముతా..

మాములుగా మేనమామ పోలికలు అల్లుడికి వస్తాయంటారు! అలాంటి పోలికలు చైతులో మీరేమైనా అబ్జ‌ర్వ్‌ చేశారా?
– చైతన్య కూడా సెట్లో నాలాగే క్వైట్ గా ఉంటాడు. షూటింగ్ కి కూడా కరెక్ట్ టైమింగ్ కి వచ్చేస్తాడు. నాలాగే దూరంగా వెళ్లి నిలబడి ఎదో ఆలోచిస్తుంటాడు. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు వీడు కూడానాలాగే..అని నవ్వుకుంటూఉంటాను.

ఈ సినిమాకి డ్రైవింగ్ ఫోర్స్ మీరేనా?
– అలా అనేం లేదండి! సినిమా బిగినింగ్ లోనే ఫాదర్,మదర్ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటాయి అక్కడినుండి కథ టేక్ ఆఫ్ అవుతుంది. మాఇద్దరివి రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒకరంటే ఇంకొకరికి ఎంత ప్రేమ, అభిమానం. వారి త్యాగం సినిమాకి హైలెట్ అవుతాయి. ప్రతి ఒక్కరికి కామన్ ఎమోషన్స్ ఉంటాయి. వాటిని ఈ సినిమాలో చాలా చక్కగా చూపించడం జరిగింది.

స్క్రీన్ టైమ్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి?
– నేను అసలు పట్టించుకోను, సీతమ్మ వాకిట్లో లో నా స్క్రీన్ టైమ్ ఎంత అని నేను చూడలేదు. అలాగే గోపాల గోపాల, ఎఫ్ 2 లో నా క్యారెక్టర్ నేనుచేసుకుంటూ వెళ్ళాను. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ లాంటివారు వారి క్యారెక్టర్స్ వాళ్ళు చేసుకుంటూ పోయారే తప్ప స్క్రీన్ టైమ్ గురించి ఆలోచించలేదు. అలా అలోచించి ఉండుంటే వారు సూపర్ స్టార్స్ అయివుండేవారే కాదు.

  •  సినిమా ఫ్యామిలీలో పుట్టడం నిజంగా నా అదృష్టంగా ఫీలవుతున్నాను. మరీ ముఖ్యంగా నాన్నగారి దగ్గరి నుండి నేర్చుకోవడానికి చాలా దొరికింది. ఎప్పుడూ ఆయన చుట్టూరా ఉంటూ కథలు వింటూనే ఉండేవాణ్ణి. సినిమా గురించి తెలుసుకుంటూనే ఉండేవాణ్ణి… ఆయన నేర్పిన క్రమశిక్షణ… ఫ్యామిలీ బాండింగ్.. ఆయనే నాకు మొదటి గురువు. 33 ఏళ్లవుతుంది సినిమాలు చేస్తూ.. రీసెంట్ గా వరుణ్ తేజ్ తో చేశాను. ఇప్పుడు చైతుతో.. ఇంకా జూనియర్ NTR, నాని.. ఇలా అందరూ యంగ్ స్టర్స్ తో సినిమా చేయాలి.

అసురన్ రీమేక్ చేస్తున్నారు కదా అప్డేట్ ఏంటి?
– శ్రీకాంత్ అడ్డాల ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కసిగా ఉన్నాడు. బేసిగ్గా హార్డ్ వర్కర్. నేను కూడా ఇంతకు ముందు తనతో పని చేసి ఉన్నాను కాబట్టి మా ఇద్దరికీ మంచి రిలేషన్ షిప్ ఉంది. ‘సీతమ్మ వాకిట్లో.. ‘ తరవాత కూడా ఓ రెండు స్క్రిప్ట్స్ చెప్పాడు. కానీ వర్కవుట్ కాలేదు. ఇన్నాళ్ళకు మళ్ళీ మా ఇద్దరికీ కుదిరింది. మరో చాలెంజింగ్ సినిమా జనవరి నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

ఫైనల్ గా మీ అభిమానులకు, చైతు అభిమానులకు ‘వెంకీ మామ’ ఎలా ఉండబోతుంది?
డిసెంబర్ 13 న మీరొక మంచి, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూడబోతున్నారు. చైతుతో సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మేం సినిమా చూసుకున్నప్పుడు మంచి చేశాం అన్న ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా వల్ల నాన్న కోరిక కూడా తీరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here