టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల లో పూజా హెగ్డే ఒకరు. తన అందాలతో సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటున్న ఈ డీజే బ్యూటీ అభిమానుల సంఖ్యను కూడా పెంచుకుంటోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే పూజా హెగ్డే సోషల్ మీడియాలో మరో రికార్డ్ ను అందుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబందించిన అప్డేట్స్ ని అందిస్తూ ఉంటుంది.
ఇక గ్లామర్ ఫోటోలు వారానికోటి దర్శనమిస్తుంటాయి. అందుకే ఆమె ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 8మిలియన్స్ దాటేసింది. ఇంతమంది అభిమానుల ప్రేమను పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ తనకు మంచి చిరునవ్వు వచ్చేలా చేశారని ఫాలోవర్స్ కి కృతజ్ఞతలు కూడా చెప్పింది. అరవింద సమేత – మహర్షి – గద్దల కొండ గణేష్ వంటి వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న పూజ హిందీలో కూడా హౌజ్ ఫుల్ 4తో సాలిడ్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ జాన్ సినిమాతో పాటు అఖిల్ 4 ప్రాజెక్ట్ తో బిజీగా ఉంది.


