సూపర్ స్టార్ రజినీకాంత్ పాలిటిక్స్ పై గత కొన్నేళ్లుగా పెద్ద సస్పెన్స్ నెలకొన్న విషయం తెలిసిందే తలైవా రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికీ మొదటి అఫీషియల్ అడుగు ఎప్పుడు వేస్తారా? అని దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా తలైవా ఇటీవల మీడియాకు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. 2021లో తమిళ ప్రజలు అద్భుతం చూస్తారని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.
కమల్ హాసన్ తో పొత్తు నిర్ణయంపై ఎన్నికల సమయంలో నిర్ణయిస్తామని చెబుతూ.. ప్రజలు పెను మార్పును చూడబోతున్నారని మాట్లాడారు. అలాగే కమల్ తప్పకుండా సక్సెస్ అవుతాడని తమిళ ప్రజలు అద్భుతమైన తీర్పును ఇస్తారని చెప్పడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రజినీకాంత్ దాదాపు తన రాజకీయా జీవితంపై ఒక అడుగు ముందుకు వేసినట్లు అర్ధమవుతోంది. గతకొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ నిర్వహించిన ఒక ఈవెంట్ లో రజినీకాంత్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ తరువాత రజనీ కాంత్ తో కలిసి రాజకీయాల్లో ముందుకు సాగడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కమల్ చెప్పాడు. ఇక ఇప్పుడు కమల్ గురించి సూపర్ స్టార్ పాజిటివ్ గా స్పందిస్తూనే అద్భుతాలు జరగబోతున్నాయని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి వీరిద్దరు ఏ విధంగా అడుగులు వేస్తారో చూడాలి.


