మాస్ యాక్షన్ తో పవర్ఫుల్ గా అదరగొట్టిన బాలకృష్ణ ‘రూలర్’ టీజర్….!!

0
760

నందమూరి బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ ల కలయికలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ‘రూలర్’. గత ఏడాది వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జైసింహా సినిమా మంచి సక్సెస్ ని అందుకోవడంతో, రూలర్ పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసిన సినిమా యూనిట్, నేడు ఈ సినిమా టీజర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ధర్మ అనే మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలకృష్ణ టీజర్ లో అదరగొట్టారు అనే చెప్పాలి. డైలాగ్స్, యాక్షన్ అండ్ ఫైట్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్టన్నింగ్ విజువల్స్ తో దుమ్మురేపిన ఈ టీజర్, ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది.

‘ఒంటి మీద పోలీస్ యూనిఫామ్ ఉంటె బోనులో సింహంలా కామ్ గా ఉంటాను, అదే యూనిఫామ్ తీసేస్తే బయటకొచ్చిన సింహంలా ఆగను…ఇక వేటే’ అంటూ బాలకృష్ణ పలికిన పవర్ ఫుల్ డైలాగ్ టీజర్ మొత్తంలో ఎంతో పవర్ఫుల్ గా ఉంది. ఇక టీజర్ రిలీజ్ తరువాత ఈ సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి అనే చెప్పాలి. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను సికె ఎటెర్టైన్మెంట్స్, హ్యాపీ మూవీస్ బ్యానర్లపై సి కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయబోతున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here