దర్శకుడి చెల్లితో కమెడియన్ పెళ్లి

0
6302

కోలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ కమెడియన్స్ లో ఒకరైన యాక్టర్ సతీష్ ముత్తుకృష్ణన్. మనోడు ఎంత బిజీ అంటే ఏడాదికి మినిమమ్ 10సినిమాలు చేస్తూ బిజిబిజీ యాక్టర్ గా తన క్రేజ్ ని పెంచుకుంటున్నాడు. శివకార్తికేయన్ మిత్రుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సతీష్ ఇప్పుడు ఓ ఇంటివాడి కాబోతున్నాడు. తమిళ్ డైరెక్టర్ సోదరితో ఇటీవల సతీష్ నిశ్చితార్ధం జరిగింది.

కొన్ని నెలల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సిక్సర్’ సినిమా తమిళ్ బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఆ సినిమా దర్శకుడు చాచి సిస్టర్ సింధుని సతీష్ వివాహం చేసుకోబోతున్నాడు. సింధు ఇంట్లో ఇటీవల సింపుల్ గా వీరి నిచ్చితార్ద వేడుక జరిగింది. ఇక డిసెంబర్ లో వీరి పెళ్లి వేడుకను గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా సతీష్ వివాహంపై వస్తున్న రూమర్స్ కి ఫైనల్ గా ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ కమెడియన్ 12కి పైగా సినిమాల్లో నటిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here