‘జార్జ్ రెడ్డి’ క్యారెక్టర్ విజువలైజేషన్ ఇన్స్పైరింగ్ గా ఉంటుంది – హీరో సందీప్ మాధవ్

0
1483

‘జార్జ్ రెడ్డి’ క్యారెక్టర్ విజువలైజేషన్ ఇన్స్పైరింగ్ గా ఉంటుంది – హీరో సందీప్ మాధవ్

జ్యోతి లక్ష్మి, వంగవీటి లాంటి చిత్రాలలో తనదయిన నటనతో మెప్పించారు సందీప్ మాధవ్( సాండీ). ప్రస్తుతం ఆయన నటించిన సినిమా ‘జార్జ్ రెడ్డి’. ‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి..సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బేనర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ నవంబర్ 22న అభిషేక్ పిక్చర్స్ ద్వారా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సందీప్ మాధవ్ ఇంటర్వ్యూ…

వంగవీటి సినిమా తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు?
– ‘వంగవీటి’ సినిమా తరవాత చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ అన్ని కొంచెం సీరియస్ క్యారెక్టర్ కావడంతో అంగీకరించలేదు. అందులోనూ ఆ సినిమా తరవాత చేయదగ్గ సినిమా అనిపించే స్థాయిలో ఏదీ కనెక్ట్ కాలేదు. జీవన్ గారు నాకు బ్రదర్ లాంటివారు. ఆయన ఈ కథ నాకు చెప్పారు. ఇలాంటి క్యారెక్టర్ కదా చేయాల్సింది అని చాలా ఎగ్జైటెడ్ అయ్యాను. వెంటనే చేద్దాం బ్రదర్ అని చెప్పి వెంటనే‘జార్జ్ రెడ్డి’ గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను.

ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి ప్రిపరేషన్స్ చేశారు?
– ఈ సినిమా చేస్తున్నాం అని ఫిక్సయ్యాక వెంటనే ఆయన లుక్ లోకి రావడం స్టార్ట్ చేశాను. 22 నుండి 25 వరకూ కనిపించాలి. దానికోసం బరువు పెరగడం, తగ్గడం చేశాను. అలాగే ఆరు నెలలు బాక్సింగ్ లో కూడా శిక్షణ పొందాను. ‘జార్జ్ రెడ్డి’కి సంబంధించిన ఆర్టికల్స్, బుక్స్, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న కొన్ని వీడియోస్ చూశాను. ‘జార్జ్ రెడ్డి’ గారితో కలిసి చదువుకున్న వ్యక్తులను, ఆయన ఫ్రెండ్స్ కి సంబందించిన కొందరిని కలిసి ఆయన గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే బిబిసిలో ప్రసారం అయిన ‘క్రైసిస్ ఆన్ ద క్యాంపస్’ డాక్యుమెంటరీ చూసి ఆయన బాడీ లాంగ్వేజ్ కి సంబందించిన కొన్ని మూమెంట్స్ అబ్జ‌ర్వ్ చేసి దాని మీద ఒక బాడీ లాంగ్వేజ్ అనుకోని దాన్ని ఇంప్లిమెంట్ చేసి చేయడం జరిగింది.

ఈ సినిమా ‘జార్జ్ రెడ్డి’ బయోపిక్ అనుకోవచ్చా?
– ఇది ‘‘జార్జ్ రెడ్డి’కంప్లీట్ బయోపిక్ కాదు ఎందుకంటే సినిమాకి కావాల్సిన కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయడం జరిగింది. కమర్షియాలిటీ కోసం కాకుండా కథకు అనుగుణంగా చాలా న్యాచురల్ గా ఉంటాయి. బేసిగ్గా ఆయన బాక్సర్, స్టూడెంట్ లీడర్ కాబట్టి విజువలైజేషన్ లో హీరోయిజం న్యాచురల్ గానే ఉంటుంది.

70వ దశకంలో జరిగిన స్టోరీ కదా! విజువల్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
– 1968-70లో స్టూడెంట్స్ కిఇప్పటి స్టూడెంట్స్ కి చాలా డిఫెరెన్స్ ఉంటుంది. అప్పట్లో వాళ్ళు ఏం చేసినా సమాజానికి ఏదోరకంగా పనికిరావాలి అని ఆలోచించే వారు. సీరియస్ నెస్ కూడా ఎక్కువ ఉండేది. అందుకే ‘జార్జ్ రెడ్డి’ తో పాటు ఆయనతో పాటు అతని స్నేహితుల క్యారెక్టర్స్ లో కూడా ఆ సీరియస్ నెస్, మెచ్యూర్ థింకింగ్ అనేది ఉంటుంది.1968 బ్యాక్ డ్రాప్ కాబట్టి ఆల్మోస్ట్ అప్పటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాం. మీరు రేపు సినిమాలో చూడబోయే బైక్స్, సైకిల్స్ ఆల్మోస్ట్ అన్నీ కొనేశాం, అవన్నీ అప్పట్లో వాడేవే. అప్పటి హైదరాబాద్ భాషను చూపిస్తూనే ఇప్పటి వారికి అర్ధం అయ్యేలా సినిమాలో లాంగ్వేజ్ఉంటుంది.

ట్రైలర్ కి అంత రెస్పాన్స్ వస్తుందని మీరు ముందే ఊహించారా?
– మేము ముందు ఊహించినట్టుగానే ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా తీస్తున్నప్పుడే ఆ అవుట్ ఫుట్ మాకు అర్ధం అయ్యేది. సినిమా కూడా అదే స్థాయిలో రీచ్ అవుతుందనే నమ్మకంతో చాలా కష్టపడ్డాం. ట్రైలర్ లో చూపించిన విజువల్స్ చూసి అందరూ ఉస్మానియా యూనివర్సిటీలో షూట్ చేశాం అనుకుంటున్నారు. కానీ కాదు. 1970 లో యూనివర్సిటీ ఎలా ఉండేదో దాన్ని బట్టి సెట్ వేశారు మా ఆర్ట్ డైరెక్టర్ గాంధీ.

పవన్ కల్యాణ్ ప్రీ రిలీజ్ కి రాకపోవడం గురించి?
– పవన్ కల్యాణ్ గారు ట్రైలర్ చూశారు. చాలా ఇంప్రెస్ అయ్యి తనని కాంటాక్ట్ అవ్వమని చెప్పారు. అలా మాట్లాడడం జరిగింది. కానీ కొన్ని పరిస్థితులవల్ల కుదరలేదని మీ అందరికీ తెలుసు. నేను ఆయనకు హార్డ్ కోర్ ఫ్యాన్ ని. ఆయన నా సినిమాకి వస్తారని చాలా ఆశ గా ఎదురుచూశాను. కానీ దురదృష్టవశాత్తు కుదరలేదు.

ఎండింగ్ ఎలా ఉంటుంది?
– సినిమా చూశాక ‘ఇంత గొప్ప మనిషిని మనం పోగొట్టుకున్నామా?’ అనే ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. ఆయన బ్రతికి ఉంటే మనల్ని చాలా అడ్వాన్స్ టెక్నాలజీ కి తీసుకెళ్లేవారు. ‘ఇస్రో.’ లాంటి సంస్థలో అవకాశం వచ్చినా యూనివర్సిటీ లో చాలా చేయాలి అని వదులుకున్నారాయన. అలాగే ఢిల్లీ యూనివర్సిటీ నుండి కాల్ వచ్చిన వెళ్ళలేదు. ఇలాంటి హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ తో ఎమోషన్స్ ఎక్కడా తగ్గకుండా సినిమా ఉంటుంది.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?
– చాలా కథలు వింటున్నాను. కానీ ఇంకా ఏమి కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నా. మిగతా వివరాలు తెలియజేస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here