ఆకట్టుకుంటున్న అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ ఫస్ట్ లుక్ పోస్టర్…!!

0
745

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ విభిన్న తరహా సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల ఎన్నో రకాల వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ లు అందుకున్న అమీర్, ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’. 1994లో హాలీవుడ్ లో టామ్ హ్యాంక్స్ హీరోగా తెరకెక్కిన ‘ది ఫారెస్ట్ గంప్’ అనే మూవీకి అధికారిక రీమేక్ గా రాబోతున్న ఈ సినిమాలోని తన పాత్ర కోసం అమీర్ ఏకంగా 20కిలోల బరువు కూడా తగ్గినట్లు చెప్పారు. 1986లో ముద్రించబడిన ఒక నవల ఆధారంగా తెరకెక్కిన ‘ఫారెస్ట్ గంప్’ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టం అని,

అటుంవటి కామెడీ డ్రామా ఫిలింలో తాను నటించాలని ఎప్పటినుండో భావిస్తున్నట్లు ఇటీవల అమీర్ తెల్పడం జరిగింది. ఇక కొద్దిరోజుల క్రితం ప్రారంభం అయిన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా నేడు ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న అమీర్ ఖాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అమీర్ ఖాన్ లుక్ అదిరిపోయిందని,

తప్పకుండా ఈ సినిమా ఆయన కెరీర్లో మరొక హిట్ సినిమా అవడం ఖాయం అని ఆయన ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కోలీవుడ్ నటులు విజయ్ సేతుపతి, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తుండడం విశేషం. ప్రీతం సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి క్రిస్మస్ కానుకగా 2020 డిసెంబర్ లో చేయనున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here