హౌజ్ ఫుల్ 4: అక్షయ్ ట్రేడ్ మార్క్ కలెక్షన్స్

0
5485

అక్షయ్ కుమార్ హౌజ్ ఫుల్ 4 సినిమాతో కెరిర్ లో మరో బెస్ట్ హిట్ అందుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి నుంచి మంచి వసూళ్లను అందుకుంటున్న ఈ డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్ చిత్ర యూనిట్ కి మర్చిపోలేని విజయాన్ని అందించింది. దీపావళి సందర్బంగా వరల్డ్ వైడ్ గా రిలీజైన విషయం తెలిసిందే.

లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమా 200కోట్ల క్లబ్ లో చేరినట్లు తెలుస్తోంది,. సినిమాకు మొదట వచ్చిన టాక్ అలాగే రివ్యూలు కొంత బయపెట్టినప్పటికీ మొత్తానికి సినిమా ఆడియెన్స్ మనసు గెలుచుకుంది. సినిమాలో డిఫరెంట్ కామెడీ స్క్రీన్ ప్లే అక్షయ్ కుమార్ నటన హైలెట్ గా నిలిచింది. కాంబినేషన్స్ కరెక్ట్ గా సెట్టవ్వడంతో హౌజ్ ఫుల్ 4 హౌజ్ ఫుల్ కలెక్షన్స్ రెండు వందల కోట్ల వసూళ్లను అందుకున్నాయి.

ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ కూడా స్టాండర్డ్ గానే ఉన్నాయి. చూస్తుంటే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరో మార్క్ ని అందుకునేలా ఉంది. అలాగే అక్షయ్ కుమార్ తో ఒక సినిమాను నిర్మిస్తే మినిమమ్ గ్యారెంటీ వసూళ్లు దక్కుతాయని నిర్మాతలకు కూడా మరో క్లారిటీ వచ్చేసింది. ఫర్హాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సాజిద్ 75కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here