రజినీకాంత్ దర్బార్ తెలుగు మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్న మహేష్ బాబు

0
510

సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు ఏ ఆర్ మురుగదాస్ ల తొలి కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దర్బార్. రజిని ఒక మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగుల కలబోతగా మురుగదాస్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన రజిని పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా తెలుగు మోషన్ పోస్టర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు సాయంత్రం గం.5 ని.30లకు రిలీజ్ చేయనున్నారు.

అలానే ఈ సినిమా హిందీ, తమిళ మరియు మలయాళ మోషన్ పోస్టర్స్ ను సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, మోహన్ లాల్ రిలీజ్ చేయబోతున్నారు. రజిని సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here