500 చిత్రాలకుపైగా నటించి విలన్ పాత్రలతో ఆకట్టుకొన్న నటుడు సత్యప్రకాశ్ దర్శకుడిగా మారి రూపొందిస్తున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. గతేడాది ‘రక్షకభటుడు’, ‘ఆనందం’, ‘లవర్స్ డే’ లాంటి చిత్రాలను అందించిన సుఖీభవ మూవీస్ బేనర్ పై ఎ.గురురాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విక్టరి వెంకటేష్ చేతుల మీదుగా విడుదలైన మోషన్ పోస్టర్ కి మంచి స్పందన రాగా తాజాగా ఈ చిత్రం టీజర్ ను స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా..
స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ – “సత్య ప్రకాష్ గారు నాకు 12 సంవత్సరాలుగా తెలుసు. మేమిద్దరం కలిసి వర్క్ చేయడం కూడా జరిగింది. తక్కువ సినిమాలు చేసిన నాకు ఇష్టమైన ఆర్టిస్ట్. ఎప్పుడు కలిసిన చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు. తన మీద ఉన్న అభిమానం తోనే ఈ ఫంక్షన్ కి రావడం జరిగింది. సత్య డైరెక్షన్ చేస్తూ తన కొడుకుని హీరోగా పరిచయం చేయడం నిజంగా గొప్ప విషయం. ఈ సినిమా మంచి హిట్ అయ్యి నటరాజ్ కి ఇండస్ట్రీ లో మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అలాగే గురురాజ్ గారు ఈ సినిమా తర్వాత మరిన్ని పెద్ద పెద్ద సినిమాలు నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాయ్ సంగీతం చాలా బాగుంది. ఈ సినిమా ద్వారా తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది” అన్నారు.
నిర్మాత ఎ. గురురాజ్ మాట్లాడుతూ.. ”మా ఆహ్వానాన్ని మన్నించి ‘ఊల్లాల ఊల్లాల’ టీజర్ ను ఆవిష్కరించిన సురేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే దర్శకుడిగా మారిన సత్యప్రకాష్ నాకెప్పటి నుంచో మంచి స్నేహితుడు. సత్య ప్రకాష్ మీద ఉన్న అభిమానంతో ఈ సినిమాలో మంచి క్యారెక్టర్స్ చేసిన ప్రభాకర్, మంగ్లీ, రోల్ రైడా, రఘు బాబు, పృథ్వి, రఘు లకు నా ధన్యవాదాలు. అలాగే ‘లవర్స్ డే’ తరువాత నూరిన్ షెరీఫ్ కి తెలుగులో చాలా ఆఫర్లు వచ్చినా ఆమెకు మేము ఇచ్చిన గౌరవం, ఆ సినిమాకు మేము చేసిన పబ్లిసిటీ నచ్చి మా సినిమానే ఫస్ట్ చేస్తాను అని చెప్పి నటించడం జరిగింది. అలాగే ఇంకో హీరోయిన్ అంకిత మిస్ బెంగుళూరు. ఆమె క్యారెక్టర్ కి 100 పర్సెంట్ న్యాయం చేసింది. ఈ సబ్జెక్ట్ కి యాప్ట్ అనిపించి నటరాజ్ ని హీరోగా ఎంచుకోవడం జరిగింది. జాయ్ మ్యూజిక్ చాలా హెల్ప్ అవుతుంది. కన్నడలో చాలా ఫేమస్ అయినటువంటి జె.జి.కృష్ణ, వారి కొడుకు దీపక్ ఈ సినిమాకు మంచి విజువల్స్ ఇచ్చారు. మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో సాంగ్ ఒక డిమాండ్ ను బట్టి 600 వెహికిల్స్ పెట్టి చిత్రీకరించాం. చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే కాసర్ల శ్యామ్ రాసిన పాటలు చాలా బాగున్నాయి. టీజర్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. త్వరలో ట్రైలర్, మిగతా పాటలు విడుదల చేస్తాం” అన్నారు.
హీరో నటరాజ్ మాట్లాడుతూ – “నన్ను హీరోగా ఎంచుకున్నందుకు నిర్మాత గురురాజ్ గారికి, మా నాన్న మీ సత్య ప్రకాష్ గారికి రుణపడి ఉంటాను. వీళ్ళిద్దరూ ఈ సినిమాకు రెండు కళ్ళు. అలాగే అంకిత, నూరిన్ చాలా బాగా నటించారు. జాయ్ మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే ఇక్కడికి వచ్చి మా టీమ్ ని బ్లెస్ చేసిన సురేందర్ రెడ్డి గారికి నా స్పెషల్ థాంక్స్ “అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ జాయ్ మాట్లాడుతూ – ” సత్య ప్రకాష్, గురురాజ్ గారు నాకు చాలా సపోర్ట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో 4 పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాను. నటరాజ్ చాలా బాగా నటించాడు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ “అన్నారు.
దర్శకుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ – ‘ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనింగ్ థ్రిల్లర్. ఈ సినిమాలో చాలా వింతలూ విశేషాలూ ఉన్నాయి. ఎవ్వరూ ఊహించని రీతిలో మేకింగ్ పరంగా కొత్తగా ఉంటుంది. దర్శకునిగా నా తొలి చిత్రానికి గురురాజ్‌లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం” అన్నారు.
నటరాజ్, నూరిన్, అంకిత, గురురాజ్, సత్యప్రకాష్, `బాహుబలి` ప్రభాకర్, పృథ్వీరాజ్, `అదుర్స్` రఘు, జబర్ధస్త్ నవీన్, లోబో, మధు, జబర్ధస్త్ అప్పారావు, రాజమౌళి, జ్యోతి, గీతాసింగ్, జయవాణి తదితరులు
సాంకేతిక నిపుణులు
సమర్పణ: శ్రీమతి ఎ.ముత్తమ్మ,
ఛాయాగ్రహణం: జె.జి.కృష్ణ, దీపక్,
సంగీతం: జాయ్,
ఎడిటింగ్: ఉద్ధవ్,
నృత్య దర్శకత్వం: శేఖర్ మాస్టర్, దిలీప్ కుమార్,
యాక్షన్: డ్రాగన్ ప్రకాష్,
ఆర్ట్: కె.మురళీధర్,
పాటలు: కాసర్ల శ్యామ్, గురుచరణ్,
కథ – స్క్రీన్‌ప్లే – మాటలు -నిర్మాత: ఎ.గురురాజ్,
దర్శకత్వం: సత్యప్రకాష్.