బిగ్ బి అమితాబ్ బచ్చన్ కెరీర్ కు 50 ఏళ్ళు

0
393

1942, అక్టోబర్ 11న ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో జన్మించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్, తన బాల్యం మరియు పెరిగి పెద్దయ్యాక ఉన్నత విద్యల అనంతరం 1969, నవంబర్ 7న తొలిసారి ‘సాథ్ హిందూస్థానీ’ అనే సినిమా ద్వారా బాలీవుడ్ సినిమా రంగ ప్రవేశం చేసారు. స్వాతంత్రోద్యమ వీరుల కథగా తెరకెక్కిన ఆ సినిమాలో అమితాబ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక అక్కడినుండి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, కెరీర్ పరంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేడు బాలీవుడ్ అగ్ర హీరో స్థాయికి చేరుకున్న ఆయన సినీ జీవితంలో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి.

అయితే వాటిలో ఆనంద్, జంజీర్, షోలే, దీవార్, డాన్, కూలి, అగ్నీపథ్, కబీ ఖుషి కబీ గమ్, బ్లాక్, పా, పీకు, పింక్ వంటి మరెన్నో గొప్ప చిత్రాలు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు 200కు పైగా సినిమాల్లో నటించిన అమితాబ్, నేటితో విజయవంతంగా 50 ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ సహా పలువురు సినీ రంగ ప్రముఖులు అమితాబ్ కు అభినందనలు తెలియచేస్తున్నారు. ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ఈ సందర్భంగా తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది. ‘కొడుకుగా కాదు, ఒక నటుడిగా ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ ని, మీ గొప్పతనం, ఖ్యాతి రాబోయే మరిన్ని తరాలకు మరింత ఆదర్శం కావాలి. అలానే మరొక 50 ఏళ్ళ పాటు మీరు సినీ జీవితాన్ని ఇలాగే కొనసాగించాలి. మీ సినీ ప్రస్థానం 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమించే మీ అభిషేక్ మీకు శుభాభినందనలు తెలియచేస్తున్నాడు’ అంటూ ఆయన తన పోస్ట్ లో తెల్పడం జరిగింది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here