తెలుగు విడుదల: ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్
బ్యానర్: ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: విజయ్, నయనతార, జాకీష్రాఫ్, యోగిబాబు, జాకీష్రాఫ్, కదిర్, డేనియల్ బాలాజీ తదితరులు
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
కెమెరా: జీకే విష్ణు
ఎడిటింగ్: రూబెన్
ప్రొడక్షన్ డిజైన్: ముత్తురాజ్
నిర్మాతలు: కల్పాతి అగోరాం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేశ్
దర్శకత్వం: అట్లీ
విజయ్, అట్లీ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం `విజిల్`. తమిళ చిత్రం `బిగిల్`కి ఇది తెలుగు అనువాదం. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే కోలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ తెలుగు మార్కెట్‌పై ఇప్పటి వరకు ఫోకస్ చేయలేదు. ఆయన కెరీర్‌లోనే తెలుగులో హయ్యస్ట్ థియేటర్స్‌లో విజిల్ సినిమా విడుదలైంది. కమర్షియల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన విజిల్ భారీ అంచనాలతో తెలుగులో విడుదలైంది. మరి విజయ్, అట్లీలకు హ్యాట్రిక్ హిట్ లభించిందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం.
కథ:
రాజప్ప(విజయ్) తన బస్తీలో ప్రజలకు అండగా నిలబడే వ్యక్తి వారిని కాపాడటానికి తను రౌడీగా మారతాడు. అయితే రాజప్ప కొడుకు మైకేల్ మాత్రం ఫుట్‌బాల్‌లో స్టేట్ ప్లేయర్ రేంజ్‌కు చేరుకుంటాడు. నేషనల్ ప్లేయర్ కావాలనుకుంటున్న తరుణలో రాజప్పను ప్రత్యర్థులు హత్య చేస్తారు. దాంతో మైకేల్ ఆటను పక్కన పెట్టేసి తన బస్తీ ప్రజలకు అండగా నిలబడతాడు. ఐదేళ్ల తర్వాత మైకేల్ స్నేహితుడు స్టేట్ ఉమెన్ ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌గా ఓ టీమ్‌ను తయారు చేసుకుంటాడు. రెండు రోజుల్లో టీమ్‌తో ఢిల్లీకి వెళుతున్న అతనిపై మైకేల్ ప్రత్యర్థులు దాడి చేస్తారు. దాంతో మైకేల్ అతని స్థానంలో కోచ్‌గా ఢిల్లీ వెళతాడు. అక్కడ మైకేల్ ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తాడు? అసలు శర్మ(జాకీష్రాఫ్) ఎవరు? అతనికి, రాజప్పకి, మైకేల్‌కి ఉన్న కనెక్షన్ ఏంటి? మైకేల్ కోచింగ్‌లో ఉమెన్ ఫుట్‌బాల్ టీమ్ ఏమవుతుంది? అనే విషయాలు తెలుసుకోవాంటే కథలోకి వెళదాం..
విశ్లేషణ:
విజయ్ , అట్లీ అంటే అంతకు ముందు పోలీసోడు, అదిరింది చిత్రాలే గుర్తుకు వస్తాయి. ఈ రెండు చిత్రాలు తర్వాత హ్యా్ట్రిక్ చిత్రంగా రూపొందిన విజిల్ భారీ అంచనాలతోనే విడుదలైంది. మనకు తెలిసిన అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడించి సన్నివేశాలను గ్రిప్పింగ్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ అట్లీ దిట్ట. విజయ్‌ను మరోసారి తనదైన స్టైల్ మాస్ యాంగిల్, కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ ఉన్న సన్నివేశాలతో ప్రతి సన్నివేశాన్ని సూపర్బ్‌గా మలిచాడు. దానికి విజయ్‌లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో తోడు కావడంతో సన్నివేశాలు నెక్ట్స్ రేంజ్ అనేలా ఉన్నాయి. విజయ్ రాజప్ప అనే రౌడీ.. మైకేల్ అనే ఫుట్‌బాల్ కోచ్ రెండు పాత్రలను మూడు వేరియేషన్స్‌లో చక్కగా నటించాడు. ఫస్టాఫ్ అంతా హీరోయిజంతో, కామెడీ, లవ్ సీన్స్‌తో నిండి ఉంటుంది. రాజప్ప క్యారెక్టర్ చాలా సీరియస్‌గా, ఓ లక్ష్యంతో సాగేలా కనపడుతుంది. పాత్రలో ఉండే సీరియస్ నెస్, ఇన్‌టెన్సిటీని చూపిస్తూ విజయ్ చక్కగా నటించాడు.
సెకండాఫ్ అంతా విజయ్ కోచ్‌గా నేషనల్స్‌కు పోటీ పడే ఉమెన్స్ ఫుట్‌బాల్ టీమ్ చుట్టూనే కథ తిరుగుతుంది. పేద అమ్మాయిలను ఎంపిక చేసి వారిని గొప్ప ప్లేయర్స్‌ను చేస్తే మరింత మంది ఇన్‌స్పైర్ అవుతారనే లక్ష్యంతో విజయ్ పడే కష్టాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఇక ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వెండితెరపై చూస్తే అబ్బో అనిపించేలా తెరకెక్కించారు. మేకింగ్‌లో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని అర్థమవుతుంది. ఇక మహిళలపై జరుగుతుతన్న యాసిడ్ దాడులు, స్త్రీల సాధికారత అంశాలను చక్కగా చూపించారు.
నయనతార తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. జాకీష్రాఫ్ స్టైలిష్ విలన్‌గా నటించి ఆకట్టుకున్నాడు. డేనియల్ బాలాజీకి చాలా రోజుల తర్వాత మంచి పాత్ర దొరికిందనే చెప్పాలి. యోగిబాబు తనదైన కామెడీ ఆకట్టుకున్నాడు. విష్ణు కెమెరా పనితనం బావుంది. ముఖ్యంగా సెకండాఫ్ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఎ.ఆర్.రెహమాన్ నేపథ్య సంగీతం చాలా బావుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇంత భారీ చిత్రాన్ని మహేష్ ఎస్ కోనేరు క్వాలిటీ డబ్బింగ్ తో తెలుగు ప్రేక్షకులకి అందించడం అభినందనీయం.
బోటమ్ లైన్:
విజిల్.. ఆకట్టుకునే కమర్షియల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా
రేటింగ్: 3/5