దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన ఇలియానా, తొలి సినిమాతో మంచి సక్సెస్ సాధించి, ఆ తరువాత పలు విజయవంతమైన సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఇటీవల రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో సక్సెస్ అందుకుని, ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇకపోతే నేడు, బ్లాక్ కలర్ డ్రెస్ లో తన కిల్లింగ్ లుక్స్ తో ఒక ఫోటో షూట్ లో పాల్గొన్నారు ఇలియానా. తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రమ్ లో ఆ పిక్స్ ని కాసేపటి క్రితం ఆమె పోస్ట్ చేసారు. కాగా ఆ మైండ్ బ్లోయింగ్ పిక్స్ చూసిన కుర్రాళ్ళకు మతిపోవడం ఖాయం అనే చెప్పాలి. ప్రస్తుతం ఆ పిక్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి….!!


