కోలీవుడ్ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా యువ దర్శకుడు అట్లీ కుమార్ ల కాంబినేషన్లో తెరెకక్కిన తాజా సినిమా బిగిల్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మాస్, కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో విజిల్ పేరుతో అనువదిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా దర్శకుడు అట్లీ, కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా, #Askatlee పేరుతో అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు.
అందులో భాగంగా, ఈ సినిమాలో బెస్ట్ సీన్ ఏదని మీరు భావిస్తున్నారు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు అట్లీ సమాధానం ఇస్తూ, తనకు ఈ సినిమాలోని సన్నివేశాలన్నీ కూడా బాగా నచ్చాయని, అయితే సినిమా మొత్తంలో ఇంటర్వెల్ ఎపిసోడ్ గా వచ్చే రైల్వే స్టేషన్ సీన్ మరింత ఇష్టమని, రేపు రిలీజ్ తరువాత ఆ సీన్, టోటల్ సినిమాలో బిగ్ హైలైట్ గా నిలుస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీ బుకింగ్స్ లో దూసుకుపోతోంది. గతంలో విజయ్, అట్లీ కాంబినేషన్లో వచ్చిన మెర్సల్, తేరి తరువాత, ఈ సినిమా కూడా హిట్ అయి వారి కాంబోలో హ్యాట్రిక్ నమోదు చేయడం ఖాయమని విజయ్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు….!!


