‘అసురన్’ రీమేక్ లో నటించనున్న విక్టరీ వెంకటేష్….!!

0
417

వెక్కై అనే తమిళ నవల ఆధారంగా వెట్రిమారన్ దర్శకకత్వంలో తమిళ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా అసురన్. ధనుష్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ సినిమాలో మలయాళ నటి మంజు వారియర్ తొలి సారి ఈ సినిమా ద్వారా కోలీవుడ్ కు నటిగా పరిచయం అవడం జరిగింది. మాస్, కమర్షియల్ అంశాలతో రివెంజ్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా, ప్రస్తుతం తమిళ నాట మంచి టాక్ తో అత్యధిక వసూళ్లతో దూసుకుపోతోంది.

ఇప్పటికే అక్కడ రూ.150 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు దక్కించుకోవడం జరిగింది. వారు ఈ సినిమాను ఒరిజినల్ మాతృకను తెరకెక్కించిన కలైపులి ఎస్ థాను వి క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించబోతున్నట్లు ఆ సంస్థ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. వెంకటేష్ 74 గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి దర్శకుడిగా ఎవరు వ్యవహరిస్తారు అనే దానిపై త్వరలో ప్రకటన రానున్నట్లు సమాచారం…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here