ప్రభాస్ @40.. ఫుల్ హ్యాపీ

0
505

*ఇలా ఉంటే ఆ అమ్మయి కేంటి? రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వవు*.. అనే డైలాగ్ కొరటాల ఎందుకు రాశాడో ఆ ఫోటో చూస్తే మరోసారి ఫుల్ క్లారిటీ వస్తోంది. ఎన్నాళ్లయినా.. ఎన్నేళ్లయినా ప్రభాస్ ప్రతి జనరేషన్ అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ అని చెప్పవచ్చు. ప్రతి సారి బర్త్ డే సందర్భంగా డార్లింగ్ స్పెషల్ ఫిక్స్ ని వదులుడుతున్నాడు. ఈ సారి కూడా ఇంకో కటౌట్ ని వదిలాడు.

స్టయిలిష్ గా నిలబడి స్మైల్ తో మనసు దోచేస్తోన్న ప్రభాస్ అప్పుడే 40లోకి వచ్చేస్తున్నాడా అంటే నమ్మబుద్ది కావడం లేదు. ఆ స్మైల్ చూస్తే ప్రభాస్ ఎంత హ్యాపీగా ఉన్నాడో అర్ధమవుతోంది. ప్రభాస్ కల్మషం లేని మనస్తత్వం అని చాలా మంది సినీ ప్రముఖులు చెప్పడం కామన్. ఇక ఇలా ఫొటోల్లో కూడా రెబల్ స్టార్ తన గుణాన్ని నవ్వుతూ చూపిస్తున్నాడు. సాహో లాంటి భారీ యాక్షన్ సినిమా అనంతరం ప్రభాస్ సినిమా లైఫ్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ నెల 23న బుధవారం 40లోకి అడుగుపెడుతున్న ప్రభాస్ తన పుట్టినరోజును విదేశాల్లో ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ ప్రభాస్ నుంచి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ రాబోతున్న విషయం తెలిసిందే. జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరక్కెక్కిస్తున్న ఆ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే మొదలుకానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here