థమన్ పండగల మోత.. ఛార్(4) మార్

0
764

యువ సంగీత దర్శకుల్లో ఇప్పుడు పోటీ చాలా గట్టిగా నడుస్తోంది. అయితే అందులో వరుసగా అవకాశాలు అందుకుంటూ మోత మొగిస్తున్న వారిలో థమన్ ఒకరు. మాస్ – క్లాస్ – లవ్ అని తేడా లేకుండా అన్ని రకాల సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. అలాగే డిఫరెంట్ గా ట్యూన్స్ అందిస్తూ కొత్త తరహాలో సంగీతప్రియుల్ని ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం థమన్ ఎంత బిజీగా ఉన్నాడో అతని సినిమాల లిస్ట్ చూస్తే అర్ధమవుతోంది.

రాబోయే పండగలకి థమన్ బాణీలే ఎక్కువగా వినపడనున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెంకీ మామ అలాగే ప్రతి రోజు పండగే సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న థమన్ సైన్స్ ఫిక్ఛన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న డిస్కోరాజాకి కూడా ట్యూన్స్ కడుతున్నాడు. సంక్రాంతి బిగ్ మూవీస్ లో ఒకటైన అల.. వైకుంఠపురములో సినిమాకు సైతం థమన్ ట్యూన్స్ సెట్ చేస్తున్నాడు. ఈ నాలుగు సినిమాలతో థమన్ తీన్మార్ కాకుండా చార్ మార్ స్టెప్పులేయించనున్నాడని చెప్పవచ్చు.

ఈ నాలుగు సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రతిరోజు పండగే – డిస్కో రాజా క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుండగా అల..వైకుంఠపురములో సంక్రాంతికి రానుంది. ఇప్పటికే మాస్ రాజా – అల్లు అర్జున్ అభిమానులకు కిక్కిచ్చే పాటలను వదిలిన థమన్ సాయి తేజ్ ఫ్యాన్స్ కి దగ్గుబాటి అక్కినేని అభిమానులకు కూడా స్పెషల్ సాంగ్స్ ని అందించనున్నాడు. ఫైనల్ గా క్రిస్మస్ – సంక్రాంతి ఫెస్టివల్స్ లో మనోడి బాణీలు ఇంకా గట్టిగా సౌండ్ చేయనున్నట్లు అర్ధమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here