ర్యాప్ సింగర్ బాద్షా లేటెస్ట్ సాంగ్ లో మెరవనున్న నిధి అగర్వాల్….!!

0
1129

నాగచైతన్య సరసన సవ్యసాచి సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన నిధి అగర్వాల్, తొలి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు కూడా సక్సెస్ సాధించి, కెరీర్ పరంగా నిధికి మంచి అవకాశాలు అందించాయి.

ఇక ప్రస్తుతం రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్న నిధి, ఫేమస్ ర్యాప్ సింగర్ కం మ్యూజిక్ డైరెక్టర్ అయిన బాద్షా స్వరపరిచిన లేటెస్ట్ మిక్స్ పాప్ సాంగ్ లో మెరవనుంది. ఆమె నటించిన ఆ వీడియో సాంగ్ ప్రోమో కాసేపటి క్రితం రిలీజ్ అయి, సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. కాగా ఆ ఫుల్ సాంగ్ వీడియోని ఈనెల 18న యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు……!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here