దర్బార్ పొలిటికల్ మూవీ కాదు: మురగదాస్

0
895

దేశం మెచ్చిన దర్శకుల్లో ఒకరైన ఏఆర్.మురగదాస్ మరో మంచి సందేశాత్మక చిత్రంతో రాబోతున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ని మొదటిసారి డైరెక్ట్ చేస్తూ.. దర్బార్ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా 2020 సంక్రాంతి కానుకగా సౌత్ ఆడియెన్స్ ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త విషయాలను దర్శకుడు మురగదాస్ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

ముఖ్యంగా సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఓ టాక్ వైరల్ అయ్యింది. అయితే ఈ సినిమాలో రాజకీయ అంశాలు ఉండవని ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కి సంబంధించిన కథ అని దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఇందులో పోలీస్ పాత్ర అలెక్స్ పాండియన్ స్టైల్ లో ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే సినిమాలో మాస్ ఆడియెన్స్ కి నచ్చే విధంగా సీనియర్ గాయకులు SP బాలసుబ్రహ్మణ్యం ఒక పాట పడినట్లు వివరణ ఇచ్చారు.

యువ సంగీత దర్శకుడు అనిరుధ్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చినట్లు తెలిపారు. సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి తో పాటు మాజీ క్రికెటర్ యువరాజ్ ఫాదర్ యోగ్ రాజ్ సింగ్ కూడా సినిమాలో స్పెషల్ పాత్రల్లో కనిపించనున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here