మగవారితో పాటు ఆడవారికి కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి – ఫోర్బ్స్ తాజా ఇంటర్వ్యూ లో నిహారిక

0
649

మెగాబ్రదర్ నాగబాబు గారి ముద్దుల తనయ నిహారిక కొణిదెల, ప్రస్తుతం నటిగా, నిర్మాతగా, పలు విభాగాల్లో తన సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో మెరిసిన నిహారిక, తాను నెలకొల్పిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ‘ముద్దపప్పు ఆవకాయ’, ‘నాన్న కూచి’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తూ వాటిని నిర్మించి మంచి విజయాలు అందుకున్నారు. ఇక ప్రస్తుతం అదే బ్యానర్ పై ‘మ్యాడ్ హౌస్’ అనే వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్న నిహారిక, నేడు ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, మొదట్లో తాను నెలకొల్పిన బ్యానర్ పై తొలి వెబ్ సిరీస్ ని నిర్మించినపుడు కొంత ఆందోళన ఉండేదని,

అయితే అది సక్సెస్ అవడంతో తనకు ఎంతో ధైర్యం వచ్చిందని అన్నారు. ప్రస్తుతం కొందరు మహిళలు కూడా సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారని, కాబట్టి మగవారిలానే ఆడవారికి కూడా సమానంగా అవకాశాలు ఇస్తే, తప్పకుండా వారు కూడా అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు. దర్శకుడిగా ఒకే ఒక్క సినిమా చేసిన సుజీత్ కు, అంతకముందు బాహుబలితో అత్యద్భుత విజయాన్ని అందుకున్న ప్రభాస్ గారు అవకాశం ఇవ్వడం వల్లనే కదా సాహో సినిమా తెరకెక్కి మంచి విజవంతం అయింది. ఆ విధంగానే మహిళలకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here