ఇటీవల కమెడియన్ నుండి హీరోగా మారిన తమిళ నటుడు సంతానం హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ డిక్కిలూన. సంతానం తొలిసారి మూడు విభిన్న పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు కార్తీక్ యోగి దర్శకత్వం వహిస్తున్నారు. కె జె ఆర్ స్టూడియోస్ రాజేష్ మరియు శిరీష్ సోల్జర్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో అధికారికంగా పారంభం కానుండగా,
ఈ సినిమాలో భారత క్రికెట్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది వరకు పలువురు క్రికెటర్లు సినిమాల్లోకి ప్రవేశించి తమ అదృష్టం పరీక్షించుకుని మంచి విజయాలు అందుకోగా, తొలిసారి ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేయబోతున్న హర్భజన్ ఎంత మేర సక్సెస్ ని అందుకుంటారో చూడాలి. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని భావిస్తోంది సినిమా యూనిట్….!!


