‘చిన్నారి పెళ్లికూతురు’గా సుపరిచయం అయినప్పటికీ ‘ఉయ్యాలా జంపాల’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు, అభిమానుల్ని ఏర్పరచుకున్నారు అవికా గోర్. ప్రస్తుతం ‘రాజు గారు గది’ ప్రాంచైజీలో వస్తున్న మూడవ చిత్రం ‘రాజుగారి గది3’. అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓక్ ఎంటర్టైన్మెంట్ బేనర్ పై హారర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘అవికా గోర్’ ఇంటర్వ్యూ..
తెలుగులో చాల గ్యాప్ తర్వాత వస్తున్నారు?
– వేరే ఆఫర్స్ వచ్చాయి అయితే కొన్ని హిందీ సినిమాలు చేయడం, ముఖ్యంగా ఒకేరకమైన సినిమాలు రావడంతో తెలుగు సినిమాలు ఎక్కువ చేయలేకపోయాను.
‘రాజుగారి గది 3’ సినిమా చేయడానికి కారణం ?
– కారణం ఈ సినిమా దర్శకుడు ఓంకార్ గారే. ఆయన తమన్నా అనుకుని రాసుకున్న పాత్రలో నేను అయితే బాగా చేస్తానని నమ్మారు. ఆయన కథ చెప్పినప్పుడే నాకు కథ బాగా నచ్చింది. అందుకే వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించాను.
హారర్ సినిమాలో మొదటిసారి నటించారు కదా! ఎలా అనిపించింది?
– పర్సనల్ గా నేను ఒంటరిగా హారర్ ఫిల్మ్స్ అసలు చూడను. ఒకవేళ చూసిన పక్కన ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ ఉంటేనే చూస్తాను. అలాంటిది ఓంకార్ గారు నాకు ఈ హారర్ కథ చెబుతున్నప్పుడే టెన్షన్ పడ్డాను. కానీ కథలో మంచి కామెడీ ఉంటుంది. కథ వింటున్న అన్నంతసేపూ నేను నవ్వుతూనే ఉన్నాను.
పోస్టర్ లోనే మీ లుక్ చాల భయం కలిగించేలా ఉంది?
– మేకప్ వేసుకునప్పుడే నన్ను నేను చూసుకుంటున్నాను. పోస్టర్ లో చూసినప్పుడు నాకు మామూలుగానే ఉంది. అయితే ఆ లుక్ లో నన్ను చూసి మా పేరెంట్స్ షాక్ అయ్యారు. కానీ కథ తెలిసాక మళ్ళీ కామ్ అయ్యారు.
మీ క్యారెక్టర్ గురించి?
– సినిమాలో నా క్యారెక్టర్ వెరీ సింపుల్… గర్ల్ నెక్స్ట్ డోర్ లా ఉంటుంది.
ఈ సినిమాలో బాగా ఆకట్టుకునే అంశాలు ఏమిటి ?
– ఈ సినిమాలో కామెడీ చాల కొత్తగా అలాగే అద్భుతంగా ఉంటుంది. సినిమా చూస్తూ ఉన్నంత సేపూ కామెడీని మనం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. అలాగే సినిమాలో డైలాగ్స్ అండ్ మ్యూజిక్ ఇలా అన్ని బాగుంటాయి. ఒక్కమాటలో ప్రేక్షకులకు కావలసిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మూవీతో ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటాం.
తెలుగు డైలాగ్స్ మీకు అర్ధం అవుతాయా ?
– అర్ధం అవుతాయి కానీ, త్వరగా మాట్లాడలేను.
తమన్నా చేయాల్సిన పాత్రను మీరు చేశారు. నటనలో ఆమెతో పోల్చి చూస్తారనే టెన్షన్ ఉందా ?
– లేదు అండి. ఏ క్యారెక్టర్ అయినా దాన్ని ఎవరు చేసినా దర్శకుడి అభిరుచికి తగ్గట్లే చేస్తారు. కాకపోతే, ఎవరి శైలి వారిది. నా వరకూ నేను ఈ సినిమా కోసం సిన్సియర్ గా వర్క్ చేశాను. అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
– బాలీవుడ్ లో యాక్ట్ చేస్తున్నాను, అలాగే హిందీ టీవీలో కూడా చేస్తున్నాను. ఇక నుండి తెలుగు మూవీస్ ఎక్కువుగా చేస్తాను.


