సరిలేరు నీకెవ్వరు ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న గ్రేట్ ఇండియా ఫిలిమ్స్

0
629

సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నికెవ్వరు. చాలా రోజుల తరువాత మహేష్ నుంచి వస్తున్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఓవర్సీస్ లో మహేష్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఓవర్సీస్ లో పోటీపడి ప్రముఖ గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ మరోసారి మహేష్ సినిమా హక్కుల్ని దక్కించుకుంది.

గతంలో యూఎస్ఏ లో అతడు – పోకిరి – భరత్ అనే నేను – అలాగే మహర్షి వంటి హిట్ సినిమాలను భారీ స్థాయిలో రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్న ఈ సంస్థ మళ్ళీ ఇప్పుడు సరిలేరు నికెవ్వరు హక్కుల్ని దక్కించుకుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటోంది. వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

SVC ప్రొడక్షన్ – GMB ఎంటర్టైన్మెంట్స్ – ఏకే ఎంటర్టైన్మెంట్స్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలకాపాత్రలో నటిస్తున్నారు. మహేష్ తో రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపించనుంది.  ఇక ప్రకాష్ రాజ్ – రాజేంద్రప్రసాద్ – బ్రహ్మాజీ వంటి సీనియర్ యాక్టర్స్ కూడా సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here