సైరా నుంచి సరిలేరు నీకెవ్వరు.. సీరియస్ టూ కామెడీ

0
1029

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ యాక్టర్ బ్రహ్మాజీ అంటే తెలియని వారుండరు. గుర్తుపట్టకపోవడానికి ఆయన వయసు కూడా మోసం చేయదు. సో చూడగానే ఆయన బ్రహ్మాజీ అని చెప్పేస్తారు. అంతలా ఫిట్ నెస్ లో కేర్ తీసుకుంటున్న ఈ సీనియర్ మోస్ట్ యాక్టర్ సినిమా సినిమాకు డిఫరెంట్ షేడ్స్ చూపిస్తున్నారు.

రీసెంట్ గా సైరా సినిమాలో ఓబన్న పాత్రలో నరసింహా రెడ్డి నమ్మకస్తుడిగా కనిపించి మంచి ఎమోషన్ ని ఎలివేట్ చేశారు. ముఖ్యంగా కొన్ని సీరియస్ సీన్స్ లో బ్రహ్మాజీ తన టాలెంట్ ని నిరూపించుకున్నారు. అయితే సీరియస్ అయినా కామెడీ అయినా దేనికదే ప్రత్యేకం అన్నట్లు ఇప్పుడు ఫుల్ కామెడీ పాత్రలో నవ్వించడానికి రెడీ అవుతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాలో బ్రహ్మాజీ మంచి కామెడీ రోల్ లో కనిపించనున్నాడట. దర్శకుడు అనిల్ రావిపూడి మేకింగ్ లో ప్రతి ఒక్క పాత్ర డిఫరెంట్ గ ఉంటుంది. ఇక గతంలో బ్రహ్మాజీ పాత్రను F2 లో ఏ విధంగా చుపించారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కనిపించింది కొన్ని సీన్లలోనే అయినా బ్రహ్మాజీ కామెడీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

మరి ఇప్పుడు సీరియస్ నుంచి కామెడీకి యూ టర్న్ తీసుకుంటున్న బ్రహ్మాజీ సరిలేరు నీకెవ్వరులో అలరించడానికి సిద్ధమవుతున్నారు. రీసెంట్ గా షూటింగ్ లొకేషన్ లో దర్శకుడు అనిల్ తో దిగిన సెల్ఫీని బ్రహ్మాజీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here