బిగిల్ యూనిక్ ప్రమోషన్స్.. 64 జట్లతో రియల్ టోర్నీ

0
301

దళపతి విజయ్ కెరీర్ లొనే అత్యంత భారీ స్థాయిలో విడుదల కానున్న చిత్రం బిగిల్. ఈ కోలీవుడ్ హీరో కెరీర్ లో ఎప్పుడు లేనంత హైప్ ఈ సినిమాపై పెరిగింది. చూస్తుంటే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టేలా ఉన్నాడు. ఈ సినిమాపై ఇంత భారీగా అంచనాలు పెరగడానికి ప్రధాన కారణం దర్శకుడు అట్లీ తో విజయ్ కాంబినేషన్. ఇదివరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు తేరి, మెర్సల్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు బిగిల్ పై కూడా సౌత్ లో అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ఇక క్రేజ్ ఎంత ఉన్నా కూడా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. యూనిక్ ప్రమోషన్స్ తో మంచి బజ్ క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.  సినిమా కాన్సెప్ట్ కి తగ్గట్టుగా ఫూట్ బాల్ టౌర్నమెంట్స్ ని ప్లాన్ చేశారు. అక్టోబర్ 19, 20వ తేదీల్లో ‘వేళాచేరి’ టికీ టకా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బిగిల్ ఫూట్ బాల్ నాకౌట్ టోర్నీ ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరగనున్న ఈ పోటీల్లో మొత్తం 64 జట్లు పోటిపడనున్నాయి.

బిగిల్ యూనిట్ గ్రాండ్ గా నిర్వహిస్తున్న ఈ టోర్నీ తమిళనాడు ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందించారు. బిగిల్ తెలుగులో విజిల్ పేరుతో విడుదలకి సిద్ధమవుతోంది.  ఇక సినిమా ట్రైలర్ ఈ నెల 12న సాయంత్రం 6గంటలకు విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here