మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ `RDX ల‌వ్‌` సినిమాకు హైలెట్‌ అవుతుంది – తేజస్‌ కంచర్ల

0
1422

‘హుషారు’ చిత్రంలో తన నటన ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తేజస్‌ కంచర్ల. ప్రస్తుతం ‘ఆర్‌ఎక్స్‌ 100’ఫేమ్‌ పాయల్‌రాజ్‌పుత్‌, తేజస్‌కంచర్ల ప్రధాన పాత్రధారులుగా శంకర్‌భాను దర్శకత్వంలో రామ్‌మునీష్‌ సమర్పకుడిగా హ్యపీమూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘ఆర్‌డిఎక్స్‌లవ్‌’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను అక్టోబర్‌ 11న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా తేజస్‌ కంచర్ల ఇంటర్వ్యూ..

ఈ ప్రాజెక్ట్ ఎలా ఓకే అయింది?
– ‘హుషారు’ సక్సెస్‌ తరువాత నాకు విజిబిలిటీ ఉంటుందని ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు బేనర్‌ వేల్యూ ఎక్కువ. అలాగే పబ్లిసిటీ, రిలీజ్‌ బాగుంటుందని హీరో అనే కాకుండా మంచి పాత్ర అని ఒప్పుకోవడం జరిగింది.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి?
– ఈ సినిమాలో నాది సిద్దు అనే లవర్‌ బాయ్‌ క్యారెక్టర్‌. నా పర్సనాలిటికి కంప్లీట్‌ అపోజిట్‌గా ఉండే పాత్ర. సాఫ్ట్‌గా, సెటిల్డ్‌గా ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ తన డెస్టినేషన్‌కి రీచ్‌ అవ్వడానికి కారణం నేనే. మేమిద్దరం ఎలా కలిశాము, మా జర్నీ ఎలా స్టార్ట్‌ అయింది అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్‌వేలోనే ఒక సీరియస్‌ ఇష్యూని కూడా టచ్‌ చేయడం జరిగింది.

ఈ సినిమా ఏ జోనర్ లో ఉంటుంది?
– ‘ఆర్‌డిఎక్స్‌లవ్‌’ అనేది కంప్లైట్‌ ఫ్యామిలీ ఫిలిం. టీజర్‌ రిలీజయినప్పుడు అందరూ ఇది అడల్ట్‌ కంటెంట్‌ మూవీ అనుకున్నారు. ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచాలనే టీజర్‌ని అలా కట్‌ చేయడం జరిగింది. అందుకే ట్రైలర్‌తో ఇది మంచి కథా బలం ఉన్న మూవీ అని క్లారిటీ ఇవ్వడం జరిగింది.

పాయల్‌ రాజపూత్‌తో వర్కింగ్?
– పాయల్‌ రాజపూత్‌ పంజాబీలో చాలా సీరియల్స్‌, మూవీస్‌ చేసింది. గుడ్‌ యాక్ట్రెస్‌.. ‘ఆర్‌ఎక్స్‌ 100’ విజయంతో స్టార్‌ అయిపోయింది. ఈ సినిమాలో ఆమెది వెరీ స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌. అయినప్పటికీ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలెట్‌ అవుతుంది. టీజర్‌, ట్రైలర్‌లో చూపించిన సాంగ్‌ కూడా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎక్కడా వల్గారిటీ అనేది ఉండదు.

మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది?
– నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 9 సంవత్సరాలు. మొదట తేజ గారి దగ్గర ‘నీకు నాకు డాష్‌ డాష్‌’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను. తరువాత ప్రకాష్‌ రాజ్‌ గారితో ‘ఉలవ చారు బిర్యాని’ సినిమా చేశాను. తరువాత ‘కేటుగాడు’ అనే మూవీ చేశాను. తరువాత ‘హుషారు’ సక్సెస్‌తో నా క్యారెక్టర్‌కి మంచి పేరు వచ్చింది.

నిర్మాణ రంగంలో వెళ్లే ఆలోచన ఉందా?
– సినిమా తప్ప నాకేం తెలీదు.. ఇప్పడు నేను సినిమా మీద సంపాదిస్తుంది కూడా మళ్ళీ సినిమాల్లోనే పెడతాను. నిర్మాణ రంగంలో ఒక రూట్‌ వెతకాలనే తేజ గారి దగ్గర చేయడం జరిగింది.

మీ నిర్మాత సి. కళ్యాణ్‌ గురించి?
– సి. కళ్యాణ్‌ గారు ఫోన్‌ చేసి ఒక మంచి క్యారెక్టర్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒక సారి వచ్చి కథ విను అన్నారు. నేను వచ్చి కథ విన్నాను. నాకు నచ్చడంతో ఓకే అన్నాను. ఈ సినిమా నా కెరీర్‌కి తప్పకుండా హెల్ప్‌ అవుతుంది. అందుకనే నా తరుపున 100 పర్సెంట్‌ ఎఫర్ట్‌ పెట్టడం జరిగింది.

హీరోగానే కంటిన్యూ అవుతారా?
– నాకు హీరోగానే కాకుండా విలన్‌గా కూడా చేయాలని ఉంది. కాకపొతే ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
– వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాను. ఈ కథలో పాయింట్‌ చాలా కొత్తగా ఉంటుంది. నితిన్‌తో ‘భీష్మ’ తర్వాత మా సినిమా సెట్స్‌ మీదకు వెళుతుంది. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here