‘కాస్ట్’ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను: టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

0
8
CASTE Teaser Launched In An EVent
CASTE Teaser Launched In An EVent
‘కాస్ట్’ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను: టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

వరుణ్ సందేశ్, గగన్ బాబు, సత్యం రాజేష్, రవి సోషల్ డ్రామా ‘కాస్ట్’(Caste) ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్ టీజర్ లాంచ్

వరుణ్ సందేశ్, గగన్ బాబు , సత్యం రాజేశ్, రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సోషల్ డ్రామా ‘కాస్ట్’. ఏకే జంపన్న రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. కశిక కపూర్, దివి వద్యా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచిన చిత్ర బృందం తాజాగా ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్ టీజర్‌ను లాంచ్ చేసింది.

కుల వివక్ష అనే ప్రధాన ఇతివృత్తాన్ని పరిచయం చేస్తూ టీజర్ ప్రారంభమవుతుంది. అగ్రకులానికి చెందిన వారి ఇంట్లోకి తమకు ప్రవేశం లేదని ఓ తండ్రి తన కొడుకుకు చెప్పే సన్నివేశంతో కథలోని సామాజిక అంశాన్ని పరిచయం చేశారు. ఆ తర్వాత కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించే ఓ పోలీస్ అధికారి పాత్రను చూపించారు. గ్రామంలో వరుసగా జరిగే దారుణ హత్యలతో కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. వరుణ్ సందేశ్, సత్యం రాజేశ్, నాగబాబు, రాజా రవీంద్ర, యాంకర్ రవి, దివి వద్యా పోషిస్తున్న కీలక పాత్రల తాలూకు గ్లింప్స్ టీజర్‌లో ఆకట్టుకున్నాయి.

దర్శకుడు ఏకే జంపన్న సున్నితమైన సామాజిక అంశాన్ని ఎంచుకుని, దానికి డ్రామా జోడిస్తూ ఆసక్తికరమైన సోషల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. కథను ముందుకు నడిపించడంలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉన్నట్లు కనిపిస్తోంది.

వరుణ్ సందేశ్ తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకోగా, పోలీస్ అధికారి పాత్రలో గగన్ బాబు పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. సత్యం రాజేశ్ తన పాత్రతో ఆసక్తిని పెంచారు. దివి వద్యా విభిన్నమైన పాత్రలో కనిపిస్తూ సర్‌ప్రైజ్ చేశారు. వీకే రామరాజు సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. అవినాష్ జీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న ‘కాస్ట్’ టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

https://www.youtube.com/watch?v=mB_0bxhPeoA

టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కోటేశ్వరరావు గారు మాకు మంచి మిత్రులు. తన తొలి ప్రయత్నంగా ఒక మంచి సినిమా తీస్తున్నారు. ‘ఇరుముడి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ గారు, డైరెక్టర్ శివ నిర్వాణ గారు ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ టైటిల్ గురించి కోటేశ్వరరావు గారిని అడిగాను.  సమాజంలోకాస్ట్  పాత్ర ఏమిటి? అంబేద్కర్ గారు దాని గురించి ఎలా ఆలోచించారు? ప్రస్తుత జనరేషన్ దాన్ని ఎలా చూస్తోంది? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మెసేజ్ ఓరియెంటెడ్‌గా, యాక్షన్ థ్రిల్లర్ అంశాలన్నీ కలిపి సినిమా చేశామని చెప్పారు. టీజర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. డెఫినెట్‌గా సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మాతకు, దర్శకుడికి, నటీనటులందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటీనటులందరూ బ్రహ్మాండంగా కనిపిస్తున్నారు.  ఇప్పుడు భారతదేశమంతా తెలుగు సినిమా వైపు చూసే స్థాయికి తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉంది. విశాఖపట్నం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోంది. సినీ పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాలు అక్కడ కూడా వేగవంతం చేయాలి. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఒక వేడుకను వైజాగ్‌లో నిర్వహించాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా సూపర్ హిట్ కావాలి. సక్సెస్ మీట్‌లో అందరం మళ్లీ కలుద్దాం.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్. తప్పకుండా ఇందులో చాలా మంచి మెసేజ్ ఉంటుందని కోరుకుంటున్నాను. నిర్మాతకు తొలి సినిమా చాలా పెద్ద విషయం. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ లక్. సినిమాను థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఒక నిర్మాతకు మనమందరం చాలా గౌరవం ఇవ్వాలి. ఒక సినిమా నిర్మించాలనే ఆలోచన వాళ్లకు రాకపోతే ఎంతోమంది ఆర్టిస్టులు, దర్శకులు, టెక్నీషియన్లకు అవకాశాలు దక్కవు. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి వస్తున్న మరో నిర్మాత కోటేశ్వరరావు గారు. ఆయనకు హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా విజయవంతమై, మరిన్ని మంచి సినిమాలు చేసే శక్తి ఆయనకు రావాలని కోరుకుంటున్నాను. తొలి సినిమా ప్రతి దర్శకుడికీ ఎంతో ప్రత్యేకం. ఈ సినిమాతో జంపన్నకు చాలా మంచి పేరు రావాలని, మరిన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. గగన్ ‘నిన్ను కోరి’ సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు తను హీరోగా రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాలో నటించిన మిగతా నటీనటులందరికీ అభినందనలు. టీజర్ చాలా బాగుంది. ఇందులో ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ఈ సినిమా ద్వారా చాలా మంచి మెసేజ్ వెళ్తుందని ఆశిస్తున్నాను.

ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన గౌరవనీయులు గంటా శ్రీనివాసరావు గారికి, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ గారికి, డైరెక్టర్ శివ నిర్వాణ గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. ఈ టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. కచ్చితంగా మీ అందరినీ అలరిస్తుంది. భారతదేశం మొత్తం ఈ సినిమా గురించి చెప్పుకుంటుంది. మా హీరోలు వరుణ్ సందేశ్ గారు, గగన్ గారు,  రవి గారితో పాటు మా టెక్నీషియన్లందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అనూప్ రూబెన్స్ గారు అద్భుతమైన మ్యూజిక్ చేశారు. త్వరలోనే పాటలు విడుదలవుతాయి. డైరెక్టర్ గారు సినిమాను బ్రహ్మాండంగా తీశారు. తను టాలీవుడ్‌లో ఒక బెస్ట్ డైరెక్టర్ అవుతారు. అందరికీ పేరుపేరునా థాంక్యూ.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ఇది చాలా మంచి కాన్సెప్ట్ ఉన్న స్టోరీ. టీజర్‌లో చూసింది ఒక చిన్న ఐడియా మాత్రమే. ఇది చాలా అద్భుతమైన సినిమా. ప్రతి ఒక్క క్యారెక్టర్‌లోనూ నటీనటులు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడంలో చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా చాలా మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ ఏకే జంపన్న మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కులమతాలకు అతీతంగా చూసేది ఒక్క థియేటర్ మాత్రమే. అక్కడ టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్తే ప్రతి ఒక్కరూ సమానంగా కూర్చోవచ్చు. అలాంటి థియేటర్‌ను, అలాంటి కల్చర్‌ను మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. థియేటర్లలో సినిమా కావాలని ధర్నా చేసేలా సినిమా తీసిన డైరెక్టర్ శివ నిర్వాణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. గంటా శ్రీనివాసరావు గారికి, నవీన్ గారికి, శివ గారికి, ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ గారు, రాజేశ్ గారు, రవి గారు, గగన్ గారు అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.

హీరో గగన్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. గంటా శ్రీనివాసరావు గారు మా సినిమాకు అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉంది. నేను ‘పుష్ప’ సినిమాకు పనిచేశాను. నవీన్ గారు  కథ విన్నారంటే ఏ సినిమా ఎక్కడ, ఎంతవరకు వెళ్తుందో చెప్పగలరు. శివ నిర్వాణ గారు చాలా మంచి వ్యక్తి. ఎంతో స్ఫూర్తిని ఇస్తుంటారు. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, మోహన్ బాబు గారు, రవితేజ గారు నాకు స్ఫూర్తి. వారిని స్ఫూర్తిగా తీసుకునే అడుగులు వేస్తున్నాను. చిన్న అవకాశం వచ్చినా పని చేస్తున్నాను.  ఇక్కడ ఉన్నంతకాలం హార్డ్ వర్క్ చేస్తానని, దర్శకుడు, నిర్మాత ఆనందంగా ఉండేలా చూసుకుంటానని మాట ఇస్తున్నాను. ఈ సినిమాను డైరెక్టర్ జంపన్న గారు అద్భుతంగా తీశారు. ఇది కంటెంట్, కమర్షియల్ అంశాలు రెండూ కలిపి తీసిన సినిమా. ఇందులో చాలా గూస్‌బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. మీరు ఎవరూ థియేటర్‌లో మిస్ కావొద్దు.

రవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ కథ,  కథను నమ్మిన నిర్మాత, ఆ కథను తెరకెక్కించిన దర్శకుడు, ఈ కథను చూసి ఇంటికి తీసుకెళ్లే ఆడియన్స్.. ఈ నలుగురూ ఈ సినిమాకు హీరోలు. ఈ సినిమా మీతో పాటు ఉండిపోతుంది.

సత్యం రాజేశ్ మాట్లాడుతూ.. మా నిర్మాత ఈ సినిమాను చాలా ప్రేమించి చేశారు. సినిమాను చాలా అద్భుతంగా తీశారు. ఇది చాలా మంచి సినిమా. తప్పకుండా మీరందరూ థియేటర్లలో చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నాను.

దివి వద్యా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది చాలా మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా. టీజర్ చాలా బాగుంది. ఈ సినిమాలో అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

నటీనటులు: వరుణ్ సందేశ్, గగన్ బాబు , సత్యం రాజేశ్, రవి, కాశిక కపూర్, దివి వద్యా, నాగబాబు, పృథ్వీ తదితరులు.

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: ఏకే జంపన్న
నిర్మాత: తోట లక్ష్మీ కోటేశ్వరరావు
బ్యానర్: గోల్డెన్ ప్రొడక్షన్స్
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: వీకే రామరాజు
ఎడిటర్: అవినాష్ జీ
పీఆర్వో: వంశీ శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here