స్టార్ హీరో ఇమేజ్ ని బట్టి హీరోని ఎలా చూపించాలో వివి.వినాయక్ కి బాగా తెలుసు. దర్శకుడిగా హీరోలని డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ లో ప్రజెంట్ చేసిన వినాయక్ ఇప్పుడు హీరోగా మారుతూ తన లుక్స్ తో షాకిస్తున్నాడు. హీరోల రేంజ్ లో కెమెరాకు స్టిల్స్ ఇచ్చిన వినాయక్ తన సరికొత్త స్టైల్ తో ఓ విధంగా షాకిస్తున్నాడనే చెప్పాలి.
హీరో అంటే ఎదో న్యాచురల్ గా కనిపిస్తాడు అనుకుంటే.. ఎవరు ఊహించని విధంగా వర్కౌట్స్ చేసి స్టైలిష్ గా రెడీ అయ్యాడు. వినాయక్ ఇచ్చిన స్టిల్స్ స్టైలిష్ గా ఉన్నాయి. హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ తో కూడా మంచి కిక్ ఇచ్చాడు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ లో వినాయక్ చేస్తున్న సినిమా త్వరలోనే మొదలు కానుంది.


