ప్రస్తుతం దేశమంతా మహారాష్ట్రలోని ఆరే ఫారెస్ట్ కి మద్దతుగా నిలుస్తోంది. చెట్లను తొలగిస్తున్న అధికారులను నిలదీస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రెటీలు కూడా సేవ్ ఆరే అంటూ..ఎవరి స్టయిల్ల్ వారు సపోర్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి కూడా అదే గళం వినిపిస్తోంది. ఇక ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని తనదైన శైలిలో ఆరే ఫారెస్ట్ ని కాపడాల్సిందిగా సోషల్ మీడియాలో వివరణ ఇచ్చాడు.
ఇస్మార్ట్ శంకర్ స్టైల్ లో వివరణ ఇస్తూ..
‘నీ అమ్మారేయ్..
నా అమ్మారేయ్..
మనందరి అమ్మ రా రేయ్..”
అంటూ.. చెట్ల కన్నా ముఖ్యమైంది ఇంకేముంటుంది? ప్రకృతి తో పెట్టుకోవద్దని అద్భుతమైన కౌంటర్ ఇచ్చాడు. రామ్ ఇచ్చిన స్టేట్మెంట్ పై నెటీజన్స్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. గతంలో కూడా ఈ ఇస్మార్ట్ హీరో ఇదే తరహాలో సామాజిక అంశాలపై స్పందించాడు. ఇక ప్రస్తుతం రామ్ తన తదుపరి ప్రాజెక్ట్ ను సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు.


