జేమ్స్ బాండ్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. బాండ్ సినిమాలకు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారు. సిరీస్ అనే పదానికి సరైన అర్థం చెప్పిన బాండ్ సినిమాలకు చావడానికి టైమ్ లేదనే చెప్పాలి. అంటే ఎండ్ కార్డ్ లేదన్నమాట. ఎన్నాళ్లయినా ఆ సినిమాలు సరికొత్తగా వస్తాయని ఒక నమ్మకం వచ్చేసింది. అసలు మ్యాటర్ లోకి వస్తే నేటితో మొదటి జేమ్స్ బాండ్ ఫిల్మ్ వచ్చి 57 ఏళ్లవుతోంది.
1962 అక్టోబర్ 5న మొదటి స్పై థ్రిల్లర్ గా డాక్టర్ నో(Dr.no) అనే జేమ్స్ బాండ్ సినిమా రిలీజయ్యింది. సక్సెల్ ఫుల్ గా 24 సిరీస్ లను పూర్తి చేసుకున్న జేమ్స్ బాండ్ కాన్సెప్ట్ నుంచి త్వరలో ‘నో టైమ్ టూ డై’ అనే మరో సినిమా రాబోతోంది. 25వ బాండ్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. డేనియల్ క్రెయిగ్ లేటెస్ట్ బాండ్ గా కనిపించబోతున్నాడు. ఇక 2020 ఏప్రిల్ నెలలో వరల్డ్ వైడ్ గా సినిమా విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి.


