మొదలైన విజయ్ 64 ప్రాజెక్ట్

0
848

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ 64వ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలవ్వకముందే ఆడియెన్స్ ని స్టార్ క్యాస్ట్ తో తెగ ఎట్రాక్ట్ చేస్తోంది. కాంబినేషన్ అంటే కోలీవుడ్ ఆడియెన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాగే ఇప్పుడు విజయ్ లాంటి బాక్స్ ఆఫీస్ హీరోతో టాలెంటెడ్ యాక్టర్స్ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవ్వడంతో అందరిలో ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారింది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఆ సినిమాలో ఇప్పటికే విజయ్ సేతుపతి ఒక ముఖ్య పాత్ర చేయడానికి ఒప్పుకోగా మరో పాత్ర కోసం యువ నటుడు శాంతను భాగ్యరాజ్ ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. హీరోయిన్ గా మాళవిక మోహనన్ నటిస్తోంది ప్రస్తుతం విజయ్ బిగిల్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అట్లీ తెరకెక్కిస్తున్న ఆ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక 64వ ప్రాజెక్ట్ ని వచ్చే ఏడాది వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు విజయ్ స్పెషల్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here