అల్లు అర్జున్ న్యూ హోమ్.. బ్లెస్సింగ్

0
1070

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త ఇంటి కోసం భూమి పూజా కార్యక్రమాలతో పనులు మొదలుపెట్టాడు. సాధారణంగా తన రెగ్యులర్ లైఫ్ ని స్టైలిష్ గా డిజైన్ చేసుకునే బన్నీ కొత్త ఇంటి విషయంలో కూడా అలాంటి ప్రణాళికలతోనే సిద్దమైనట్లు సమాచారం. ఇక తన కొత్త ఇంటికి అల్లు అర్జున్ బ్లెస్సింగ్ అని నామకరణం చేశాడు. తన ఫ్యామిలీతో కలిసి భూమి పూజ చేసిన స్టైలిష్ స్టార్ అభిమానులతో ఆ ఫోటోని షేర్ చేసుకున్నాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురములో అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్ గా విడుదలైన రొమాంటిక్ సాంగ్ ‘సామజవరగమన’ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ ని అల్లు అరవింద్, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here