సైరా లో స్పెషల్ అట్రాక్షన్ గా అనుష్క గెస్ట్ రోల్

0
880

భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి విడుదలై ప్రశంసలతో పాటూ కలెక్షన్లు కూడా రాబడుతోంది. మెగాస్టార్ పెర్ఫార్మన్స్ తో పాటు సురేందర్ రెడ్డి డైరెక్షన్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి విశేషంగా మాట్లాడుకుంటున్నారు. కాగా  సినిమాలో ఒక సర్‌ప్రైజ్ సరికొత్త కిక్ ఇచ్చిందనే చెప్పాలి. అనుష్క వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయి గా కనిపించడం అభిమానుల జోష్ కి మంచి డోస్ లా పనిచేస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అనంతరం ఊహించని విదంగా అనుష్క పాత్ర ఎంట్రీ ఇస్తుంది. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఝాన్సీ లక్ష్మి భాయ్ తన సైనికులకు మొదటి స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ గురించి చెబుతూ స్ఫూర్తి నింపుతుంటారు. ఆ పాత్రకు అనుష్క ప్రాణం పోసిందనే చెప్పాలి. గత సినిమాల్లో కత్తి పట్టి ఆడియెన్స్ ని మెప్పించిన ఈ స్టార్ హీరోయిన్ మరోసారి వీరనారిగా తెరపై క్లిక్కయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here