మంచి సినిమాలు తెరకెక్కితే వెంటనే వీక్షించి వాటిపై పాజిటివ్ గా స్పందించడం మహేష్ కు అలవాటే. మన సూపర్ స్టార్ కి సినిమా నచ్చితే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా ఎలాంటి సినిమాకైనా తన బెస్ట్ విషెస్ అందిస్తారు. ఇక ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న ఊరంతా అనుకుంటున్నారు ట్రైలర్ వీక్షించిన మహేష్ ప్రతి సీన్ ని ఎంజాయ్ చేసినట్లు చెప్పారు.
సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ట్రైలర్ రిఫ్రెషింగ్ గా అనిపించిందని సూపర్ స్టార్, కథనాయకుడికి విషెస్ అందించారు. ఇక చిత్ర యూనిట్ ని కూడా అభినందిస్తు సినిమా విడుదల సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు.


