దబాంగ్ సీక్వెల్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ చేస్తోన్న కండలవీరుడు సల్మాన్ ఖాన్ అదే స్టైల్ లో మరో కథతో రెడీ అవుతున్నాడు. చుల్ బుల్ పాండేగా మూడవసారి రెడీ అయినట్లు ఒక స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశాడు. చుల్ బుల్ పాండే ఈజ్ బ్యాక్ అంటూ.. అనుకున్న సమయానికి దబాంగ్ 3తో రాబోతున్నట్లు సల్మాన్ స్టయిలిష్ గా వివరణ ఇచ్చాడు.
గ్యాప్ లేకుండా స్పీడ్ గా షూటింగ్ ని పూర్తి చేస్తున్న సల్మాన్ సినిమా ప్రమోషన్స్ డోస్ ను కూడా పెంచినట్లు తెలుస్తోంది డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ముందే ఎనౌన్స్ చేయడంతో షెడ్యూల్స్ కి యమ స్పీడ్ గా ఫీనిషింగ్ టచ్ చేస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దబాంగ్ 3లో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో సుదీప్ విలన్ గా కనిపించబోతున్నాడు.