ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రకరకాల పాత్రలతో మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ మాధవన్ గురించి అందరికి తెలిసిందే. సాధారణంగా సెలబ్రెటీల పిల్లలు వారి తల్లిదండ్రుల ద్వారా గుర్తింపు అందుకుంటూ ఉంటారు. కానీ కొడుకు వల్ల ఇప్పుడు మాధవన్ పేరు మారుమ్రోగింది. దేశం కోసం కొడుకు సాధించిన విజయాన్ని సగర్వంగా మాధవన్ అందరితో షేర్ చేసుకుంటున్నాడు.
ఆసియా ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటి సిల్వర్ మెడల్ అందుకున్న యంగ్ బాయ్ వేదాంత్ ఎవరో కాదు.. మాధవన్ తనయుడే. గత కొన్నాళ్లుగా స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటూ వస్తున్న ఈ యువ కెరటం ఫైనల్ గా 4 × 100 స్విమ్మింగ్ రిలేలో రజతం సాధించి తన తండ్రి గర్వపడేలా చేశాడు. అతను గెలిచిన తరువాత ప్రతి ఒక్కరు వీళ్ళ నాన్న మాధవన్ కదా అని మాట్లాడుకుంటున్నారు. కొడుకు విజయాన్ని ఎంజాయ్ చేసిన మాధవన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు.


