ప్రముఖ తమిళ స్టార్ సూర్య ఇటీవల కాప్పన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బందోబస్త్ పేరుతో ఆ సినిమా తెలుగు లో రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది. అటు తమిళనాడులో ప్రస్తుతం కాప్పన్ సినిమా మంచి టాక్, కలెక్షన్ తో దూసుకుపోతోంది.
ఆ సినిమాలో వ్యవసాయం యొక్క ఆవశ్యకత మరియు రైతులకు సంబందించిన సమస్యను ప్రస్తావించి, వారికి తమవంతుగా మద్దతిచ్చినందకు గాను నటుడు సూర్యను అలానే దర్శకుడు కెవి ఆనంద్ ను కావేరి డెల్టా రైతులు నేడు ఘనంగా సన్మానించారు. సూర్య గారు తన సినిమాల్లో ఈ విధంగా పలు సామజిక అంశాలను స్పృశిస్తూ నిర్మిస్తుండడం ఎంతో ఆనంద దాయకమని వారు అభినందించారు.


