మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా మరి కొద్దీ రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. సినిమా కోసం చిత్ర యూనిట్ పడిన కష్టం గురించి ఒక్కొక్క విషయం ఇప్పుడిపుడే బయటపడుతున్నాయి. ఇక సైరా ట్రివియా అంటూ సైరా టీమ్ చెబుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
సినిమాలో ఒక సాంగ్ కోసం ఎప్పుడు లేని విధంగా 4,500 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారట. జాతర సాంగ్ కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి నిర్విరామంగా 14రోజులు తన టీమ్ తో షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ స్థాయిలో ఇంతవరకు ఎవరు ప్రయోగం చేయలేదు. మరి ఆ రేంజ్ లో తెరకెక్కించిన జాతర సాంగ్ తెర మీద ఈ స్థాయిలో ఉండబోతోందో. అక్టోబర్ 2న విడుదల కాబోతున్న సైరా ప్రీమియర్స్ ను ఒకరోజు ముందుగానే యూఎస్ లో ప్రదర్శించిననున్నారు.


