ఆ డైలాగ్స్ కి పడిపోయిందట

0
682

మొన్నటివరకు టాలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటోంది. అయ్యారి – దే దే ఫ్యార్ దే సినిమాలతో బాలీవుడ్ లో క్లిక్కయిన రకుల్ నెక్స్ట్ మర్ జావాన్ అనే సినిమాతో రాబోతోంది. రితేష్ దేశ్ ముఖ్ మరగుజ్జు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మరో మెయిన్ లీడ్ లో సిద్దార్థ్ మల్హోత్రా కనిపించనున్నాడు.

తారా సూతరియ – రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలు. అయితే సినిమాలో రకుల్ పాత్ర కనిపించేది చాలా తక్కువ అయినా చాలా స్పెషల్ గా ఉంటుందట. ఆ పాత్ర ఒప్పుకోవడానికి ప్రధాన కారణం సినిమాలో డైలాగ్స్ అని ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో తెలిపింది. సినిమాలో తన పాత్ర యొక్క డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయని, ఆ పాత్రలో కల్ట్ క్లాసిక్ ఉమ్రాజన్‌లో రేఖా పాత్ర తరహాల హ్యాంగోవర్ ఉన్నందున, నో చెప్పలేకపోయాను అని రకుల్ వివరణ ఇచ్చింది. మరి డైలాగ్స్ కి పడిపోయిన రకుల్ ఈ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి. మిలాప్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ లో రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here