కొండారెడ్డి బురుజు సెట్ వ‌ద్ద షూటింగ్ జ‌రుపుకుంటున్న సూప‌ర్‌స్టార్ మహేష్‌ `స‌రిలేరు నీకెవ్వ‌రు`

0
942

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు`. ప్ర‌స్తుతం ఈ సినిమా హైద‌రాబాద్ రామోజీ ఫిలిమ్ సిటీలో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. క‌ర్నూలు కొండారెడ్డి బురుజు వ‌ద్ద చిత్రీక‌రించిన `ఒక్క‌డు` సినిమా స‌రికొత్త హిస్ట‌రీని క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమా కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో కొండారెడ్డి బురుజు భారీ సెట్‌ను వేసి షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షెడ్యూల్‌ జరుగుతోంది. 2020 సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా …

నిర్మాత అనీల్ సుంక‌ర మాట్లాడుతూ – “16 ఏళ్ల క్రితం వెండితెర‌పై కొండారెడ్డి బురుజు లొకేష‌న్ ఐకాన్‌గా మారింది. మ‌ళ్లీ ఇప్పుడు ఆ లొకేష‌న్‌కు వ‌చ్చాం. అయితే ఈసారి మ‌రింత పెద్ద‌దిగా లొకేష‌న్‌ను ఆవిష్క‌రించనున్నాం. మా ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ఎ.ఎస్‌.ప్ర‌కాశ్.. కొండారెడ్డి బురుజు లొకేష‌న్‌ను అద్భుత‌మైన రీతిలో తీర్చిదిద్ది రామోజీ ఫిలిమ్ సిటీలో ఆవిష్కరించారు“ అన్నారు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ దిల్‌రాజు మాట్లాడుతూ – “మ‌హేశ్‌, కొండారెడ్డి బురుజు అనే ఎపిక్ కాంబినేష‌న్ ఈ సంక్రాంతికి మీ ముందుకు రానుంది“ అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, ప్రకాష్ రాజ్ , రాజేంద్రప్రసాద్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ పనిచేస్తున్న సాంకేతిక వర్గం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here