మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం వాల్మీకి రేపు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్, సినిమాపై అంచనాలు అమాంతం పెంచేయడంతో, ఆ అంచనాలు తప్పకుండా అందుకుంటాం అని సినిమా యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇకపోతే కోర్ట్ ఉత్తర్వుల మేరకు ఈ సినిమా టైటిల్ ని ‘గద్దలకొండ గణేష్’ గా మార్పు చేస్తున్నట్లు దర్శక, నిర్మాతలు కాసేపటి క్రితం ఒక మీడియా మీట్ ద్వారా తెలియచేయడం జరిగింది.
మొదట ఈ సినిమాకు వాల్మీకి అని టైటిల్ నిర్ణయించడంతో, ఒక సామజిక వర్గం వారు కోర్ట్ ని ఆశ్రయించడం జరిగింది. కొన్నాళ్ల నుండి కోర్ట్ లో ఈ కేసుపై వాదనలు జరిగిన పిమ్మట, నేడు ఈ సినిమా టైటిల్ మార్చవలసిందిగా సినిమా యూనిట్ కు కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో, వాల్మీకి యూనిట్ తమ సినిమా టైటిల్ ను గద్దలకొండ గణేష్ గా మార్పు చేస్తున్నట్లు ప్రకటించారు……!!